అన్ని తెలుగు వార్తల సమాహారం

RGV పై నాగబాబు పుట్టినరోజు సందర్బంగా ట్వీట్ -- తిట్టారా ? పొగిడారా ?



RGV పై నాగబాబు పుట్టినరోజు సందర్బంగా ట్వీట్  -- తిట్టారా ? పొగిడారా ?


రామ్ గోపాల్ వర్మ .బహుశా ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పేరు టీఈయని వారు ఉండరేమో.కాంట్రవర్సీ కింగ్ .అయన చేసే ప్రతీ  ట్వీట్ లోను ఒక కాంట్రావర్సీ స్టేట్మెంట్ ఉంటుంది. కొంతమంది అతనిని మేధావి అంటారు . కొంతమంది అజ్ఞాని అంటారు .కానీ ఆయన దేనిని పట్టించుకోడు. తన ఏదైనా చెప్పవలసివస్తే నిర్మొహమాటంగా చెప్పేస్తారు.


ఆయనమీద నాగబాబు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ  ట్వీట్ చేశారు . కానీ ఆయన ట్వీట్ అతనిని తిట్టారో లేక పొగిడారో కన్ఫ్యూషన్ గా ఉంది.


మీరు చుడండి :


మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో, మనసులో ఏదైతే ఉందో నిర్మొహమాటంగా అదే బయటపెడతారు. ఎలాంటి పట్టింపులు ఉండవు. మీ అభిప్రాయాలు, దృక్పథం సమాజానికి చాలా అవసరం.. కానీ ఇది మీ అహంకారం, మూర్ఖత్వం అని ప్రజలు అనుకోవచ్చు. మీరు మాట్లాడేవన్నీ ఆమోదించదగినవే అయినా ఈ సమాజం నిజాన్ని అంగీకరించడానికి భయపడుతోంది. మీ పద్ధతులు, జీవన విధానం ప్రతి ఒక్కరినీ బాధపెడుతుందని అందరూ అనుకోవచ్చు.. కానీ మీరలా ఉండటం చూసి అంతా అసూయ పడుతున్నారు.


అద్భుతమైన సత్యం ఏంటంటే .. మిమ్మల్ని నిమగ్నం చేసేవి, మీరనుకున్నంతగా కిక్కిచ్చేవి ఈ ప్రపంచంలో ఇంకేమీ లేవు. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ బోరింగ్ ప్రపంచంలో మీరు కోరుకునేది దొరికేంత వరకూ మీ జర్నీ కొనసాగుతుందని, ఆ కిక్ మీకు దొరుకుతుందని నమ్ముతూ.. నాకు తెలుసు ఈ బర్త్ డే విషెస్ మీకు నచ్చవని. అందుకే దాన్ని విస్మరించి మీకు నచ్చినట్టు మీరు జీవించండి'' అంటూ  పేర్కొన్నారు నాగబాబు

 

RGV పై నాగబాబు పుట్టినరోజు సందర్బంగా ట్వీట్ -- తిట్టారా ? పొగిడారా ? RGV పై నాగబాబు పుట్టినరోజు సందర్బంగా ట్వీట్  -- తిట్టారా ? పొగిడారా ? Reviewed by Manam Telugu Vaaram on 3:53 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.