అన్ని తెలుగు వార్తల సమాహారం

Viral Bike Stunt Video: బైక్ స్టంట్ చేస్తుండగా... తేడా కొట్టింది... ఆ క్షణంలో.

 

Viral Bike Stunt Video: బైక్ స్టండ్ చేయడం కొందరికి అలవాటు. అది ప్రాణాలకే ప్రమాదమైనా... చేస్తుంటారు. అలా చెయ్యాలని ప్రయత్నిస్తుండగా ఏం జరిగిందో వీడియోలో చూద్దాం.



Viral Bike Stunt Video: కుర్రాళ్లకూ బైక్‌కీ అవినాభావ సంబంధం ఉంటుంది. చేతిలో బైక్ ఉంటే... ఇక వాళ్లను ఆపడం కష్టం. సాహసమే శ్వాసగా సాగిపోతారు. ఐతే... అన్ని జాగ్రత్తలూ తీసుకొని సాహసాలు చేస్తే... ఏ సమస్యా ఉండదు. కానీ చాలా మంది... సాహసం మాత్రమే చేస్తారు... అదే ప్రాణాలపైకి తెస్తుంది. ముఖ్యంగా తాము చేసే ఫీట్లు, స్టంట్‌లను ఎవరైనా వీడియో తీస్తే... కుర్రాళ్లు మరింత రెచ్చిపోతారు. తమనే వీడియో తీస్తున్నారనే ఉద్దేశంతో... లేనిపోని ఫీట్లు (Dangerous stunts) చేస్తారు. అన్నీ అనుకున్నట్లే జరగవు కదా... ఈ వీడియోలో కూడా అదే అయ్యింది. ఓ ఖాళీ రోడ్డులో రయ్యిన వెళ్తున్న కార్రాడు... మెల్లగా రెండు కాళ్లనూ పైకి ఎత్తి బైక్ సీట్‌పై నిలబడేందుకు ప్రయత్నించాడు. బైక్ హ్యాండిల్ వదిలేసి అలా నిలుచొని... క్షణంలో మళ్లీ హ్యాండిల్ పట్టుకుందామని ప్రయత్నించాడు. అప్పటికే బండి ఓ పక్కకు ఒరిగింది. దాంతో హ్యాండిల్ పట్టుకోవడం కుదరక (lose control)... మరోవైపుకి పడిపోయాడు.

అసలు రోడ్లపై ఇలాంటి ఫీట్లు (Bike stunt) చెయ్యడం చట్ట రీత్యా నేరం అని పోలీసులు చెబుతూనే ఉన్నారు. యూపీ పోలీసులైతే... ఇలాంటి వాళ్లను వెతికి మరీ కనిపెట్టి... రూ.2000 చొప్పున ఫైన్ వేస్తున్నారు. అయినా సరే... మన కుర్రాళ్లలో జోరు తగ్గట్లేదు. ఈ వీడియో వైరల్ (Social media viral video) అయ్యింది. చాలా మంది ఇది చూసి... ఇలా ఎప్పుడూ చెయ్యకూడదు అనుకుంటున్నారు. ఆ వీడియో మీరూ చూడండి.

Viral Bike Stunt Video: బైక్ స్టంట్ చేస్తుండగా... తేడా కొట్టింది... ఆ క్షణంలో. Viral Bike Stunt Video: బైక్ స్టంట్ చేస్తుండగా... తేడా కొట్టింది... ఆ క్షణంలో. Reviewed by Manam Telugu Vaaram on 3:02 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.