అన్ని తెలుగు వార్తల సమాహారం

అదృష్టం..! తిరిగి మళ్లీ వెతుకుంటూ..


 వాషింగ్టన్‌: లాటరీ టిక్కెటు  తగలడం అంటే మమూలు విషయం కాదు. ఇంకేముంది.. ఏడారి జీవితంలోకి ఓయాసిస్‌ ఎదురైనట్లే. జీవితమే మారిపోతుంది. ఎన్నో ఆలోచనలకు గాల్లోనే మేడలు కట్టేస్తాం. అంతలోనే గెలుచుకున్న లాటరీ టిక్కెటు పోతే, ఏముంది! అదృష్టం ఇలా తలుపు తట్టి , అలాపోతే, అనుకున్న ఆలోచనలు , అన్ని నీరుగారిపోతాయి. కానీ పోయిన టికెట్‌ తిరిగి దొరికితే.. మన ఆనందానికి అవధులుండవు. సరిగ్గా ఇలాంటి ఘటననే అమెరికాలో జరిగింది. ఓ వ్యక్తి లాటరీలో 1.2 మిలియన్‌ డాలర్లను గెలుచుకొని టికెట్‌ పోగొట్టుకున్నాడు. అదృష్టం బాగుండి పోయిన టికెట్‌ దొరికింది.


వివరాల్లోకి వెళితే... అమెరికాలోని టేనస్సీ రాష్ట్ర వ్యక్తి  నిక్ స్లాటెన్(31) మార్చి 10న గ్రాసరీ స్టోర్‌లో లాటరీ టికెట్ ను కొన్నాడు. మరుసటి రోజు ఉదయం... స్లాటెన్‌ తీసుకున్న టిక్కెట్టు లాటరీలో ఎంపికైంది. తాను గెలుచుకున్న లాటరీ టికెటు నగదు బహుమతిని తీసుకెళ్దామనే లోపు, నిక్‌ టిక్కెటును  పొగొట్టుకున్నాడు. దీంతో నిక్‌ పూర్తిగా నిరాశ చెందాడు. అదృష్టం ఇలా తలుపు తట్టినట్టే తట్టి అలా వెళ్లిపోయిందని బాధపడ్డాడు. కానీ ఆ బాధ కాసేపటికే తీరింది. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? పోగొట్టుకున్న లాటరీ టికెట్‌.. అదృష్టంకొద్ది తాను వెళ్లేదారిలో దొరికింది. దీంతో నిక్‌ ఆనందానికి అవధుల లేకుండా పోయాయి. ఇదంతా రోజులోనే జరిగింది. రాసి పెట్టి ఉండాలే కానీ, పోయింది కూడా తిరిగి మనల్ని వెతుక్కుంటు వస్తుందంటే ఇదే కాబోలు.

అదృష్టం..! తిరిగి మళ్లీ వెతుకుంటూ.. అదృష్టం..! తిరిగి మళ్లీ వెతుకుంటూ.. Reviewed by Manam Telugu Vaaram on 12:21 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.