ముంబై : తన పాలసీదారులకు ఎల్‌ఐసీ(జీవిత బీమా సంస్థ) ఓ ముఖ్య సూచన చేసింది. పాలసీ మెచ్యూరిటీ సమయం ముగియడం కానీ, పాలసీపై రుణం తీసుకోవాలని కానీ చూస్తున్నట్లయితే... ఎన్‌ఈఎఫ్‌టీ ఆదేశం ఫారంను తప్పని సరిగా నింపాల్సి ఉంటుంది. లేనిపక్షంలో... పాలసీ మెచ్యూరిటీ డబ్బును పొందలేరు.
చెక్కుల ద్వారా చెల్లింపులు చేయడాన్ని ఎల్ఐసీ నిలిపివేసిన విషయం తెలిసిందే. బీమా సంస్థ ఇప్పుడు ప్రత్యక్ష పాలసీదారుల బ్యాంక్ ఖాతాకు డబ్బును బదిలీ చేస్తోంది. ఇందుకోసం ఎల్‌ఐసీ పాలసీని బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే క్లెయిమ్ డబ్బులు అలానే ఉండిపోతాయి.
అంతే కాదు... అదనపు ఖర్చు లేకుండా ఎక్కడి నుండైనా పాలసీ డబ్బు(ప్రీమియం)ను చెల్లించేందుకు తాజాగా వెసులుబాటు ఏర్పడింది. అన్ని డిజిటల్ చెల్లింపులు అదనపు రుసుము లేకుండా ఉంటాయి. ఉచిత ఈ-సేవల కోసం, ఎల్ఐసీ కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లోని పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.
![ఎల్ఐసీ ఖాతాదారులు... ఈ ఫారం నింపకపోతే డబ్బు ఇరుక్కుపోయినట్లే...](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhM_Ma6AQEmsZeC7-Qt8feRFTA1xAd58F73mj-20Gn1MN9Vuco0XRxoCFg9voU5ioO3zm1cdVtCb-FbbEpPaYq11-N7tyDa8pG7MCAo61zBIDofKg1s0k0-0zY-A36Y75hIQVefKZIwpe8v/s72-c/lic.jpg)
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know