హైదరాబాద్/నార్సింగ్ : నిద్రమత్తులో వేగంగా బైక్ నడిపిన ఓ వ్యక్తి డివైడర్‌ను ఢీకొని దుర్మరణం చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బిహార్‌కు చెందిన విక్కీ కుమార్ (25) ఎయిర్‌పోర్టులో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను గచ్చిబౌలిలో నివసిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో తన సోదరి స్నేహితురాలు, ఢిల్లీ నివాసి ఇషాభట్‌తో కలసి నార్సింగ్ వైపునుంచి గచ్చిబౌలికి బైక్(టీఎస్09-ఇజడ్5797)పై వెళ్తుండగా, మైహోం అవతార్ వద్ద వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన విక్కీ కుమార్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఇషాభట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు. వీరు శంషాబాద్‌లో ఓ పార్టీకి వెళ్లివస్తున్నట్లు సమాచారం.
![కొంప ముంచిన నిద్రమత్తు.](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhlnqzKcPHe_EaYruB3O01F8OOdgpsQw-KSyXbz5Rqpf5VQaR7Zg9Sd56EzXCCF61bxFSqzD0ISpL2zYfuxlY6qS5JCxEXLWPRenxXgvV3MTaW6mPsvnWfhwnEVzrMwlLCMnukf3vqgJe9P/s72-c/kompa.jpg)
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know