అన్ని తెలుగు వార్తల సమాహారం

Banana Peel: తలనొప్పిగా ఉందా? మటన్ ఉడకాలా? అరటి తొక్కతో అద్భుత చిట్కాలు

 

తలనొప్పి ఎక్కువగా ఉంటే అరటి తొక్కను డీప్ ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచి దాన్ని నుదురుపై పెట్టుకుంటే తల నొప్పి తగ్గుతుంది. కాలిలో ముల్లు గుచ్చుకుంటే ఆ ప్రదేశంలో అరటి తొక్కను ఉంచి ఆ తర్వాత ముల్లు తీసేస్తే సులభంగా వస్తుంది.



అరటి పండ్లు మన ఆరోగ్యానికి ఎంత మంచివో తెలిసిందే.. ఎన్నో పోషకాలు నిండి ఉండే అరటి పండ్లు రోజుకు ఒక్కటి తింటే చాలు.. మన శరీరానికి అవసరమైన పొటాషియంలో ఎక్కువ శాతం మనకు అందుతుంది. ఈ పండును పూర్వం తెలివిగలవారు తినే ఫలంగా పిలిచేవారట. అయితే అరటి పండును తిని తొక్క పడేయడం మనలో చాలామందికి అలవాటు.. అరటి పండుతో పాటు తొక్కలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ తొక్కను అవసరం లేదంటూ పడేయడం కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు.

అరటి తొక్కలో కూడా పొటాషియం ఎక్కువగానే ఉంటుంది. దీన్ని సాధారణంగా చర్మంపై దోమలు లేదా వేరే కీటకాలు కుట్టి దద్దుర్లు అయినప్పుడు అరటి తొక్కతో ఆ ప్రదేశంలో రుద్దితే నొప్పి, వాపు తగ్గుతుంది. అరటి తొక్కతో తరచూ రుద్దడం వల్ల చర్మం అందంగా కనిపించడంతో పాటు ముడతలు కూడా తగ్గుతాయి. నల్లని మచ్చలు కూడా తగ్గుతాయి. చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌లా కూడా ఇది ఉపయోగపడుతుంది.

తలనొప్పి ఎక్కువగా ఉంటే అరటి తొక్కను డీప్ ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచి దాన్ని నుదురుపై పెట్టుకుంటే తల నొప్పి తగ్గుతుంది. కాలిలో ముల్లు గుచ్చుకుంటే ఆ ప్రదేశంలో అరటి తొక్కను ఉంచి ఆ తర్వాత ముల్లు తీసేస్తే సులభంగా వస్తుంది. మటన్ ఎంతసేపు ఉడికించినా ఉడకకపోతే అందులో అరటి తొక్కను వేసి ఉడికిస్తే మెత్తగా ఉడుకుతుందట.

అరటి తొక్క లోపలి భాగంతో పాలిష్ చేయడం వల్ల వెండి సామాను తళతళా మెరుస్తూ ఉంటుంది. దీంతో పాటు లెదర్ షూలను కూడా అరటి తొక్కతో పాలిష్ చేయవచ్చు. అరటి తొక్క లోపలి భాగంతో పళ్లను రబ్ చేయడం వల్ల అవి కూడా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఎంత బాగా బ్రష్ చేసినా కొందరి పళ్లు పసుపుబారిపోయి కనిపిస్తుంటాయి. ఇలాంటివారు అరటి తొక్కలను అప్పుడప్పుడూ పళ్లు రబ్ చేయడానికి ఉపయోగించడం వల్ల అవి మెరుస్తాయి.

ఇవన్నీ ఒకెత్తైతే అరటి తొక్కను గార్డెనింగ్ లో ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఆర్గానిక్ ఎరువుగా ఇది మొక్కలు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం మొక్కలు వివిధ రకాల వ్యాధులతో పోరాడేందుకు వాటికి శక్తిని అందిస్తుంది. పండ్ల మొక్కలకు దీన్ని ఎరువుగా వేస్తే పండ్లు రుచిగా తయారవుతాయట. పూలు, పండ్లు ఎక్కువగా రావడానికి కూడా ఇది తోడ్పడుతుంది. దీనికోసం అరటి తొక్కలను పెద్ద మొక్కల పక్కన పాతి పెట్టడం మంచిది.

అరటి తొక్కలను చిన్న ముక్కలుగా చేసి ఒక జార్లో వేసి దాని నిండా నీళ్లు నింపి వారం రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి. వారం తర్వాత ఈ నీటిలో మగ్గిన తొక్కలను కుండీల్లో వేసి నీటిని కూడా కొద్దికొద్దిగా మొక్కలకు పోయడం వల్ల మొక్కలు వెంటనే అందులోని పోషకాలను పీల్చుకుంటాయి. ఇక ఫర్టిలైజర్ తయారుచేసుకోవాలనుకునే వారు అరటి తొక్కలు, కొన్ని మొక్కల ఆకులు, మిగిలిన కూరగాయలు అన్నీ కలిపి అందులో కొద్దిగా మట్టి వేసి వారం రోజుల పాటు కవర్‌లో వేసి కప్పి పెట్టాలి. వారం తర్వాత అన్నీ మట్టిలో కలిసిపోతుండగా తీసి మొక్కలకు ఎరువుగా వేస్తే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి.
Banana Peel: తలనొప్పిగా ఉందా? మటన్ ఉడకాలా? అరటి తొక్కతో అద్భుత చిట్కాలు Banana Peel: తలనొప్పిగా ఉందా? మటన్ ఉడకాలా? అరటి తొక్కతో అద్భుత చిట్కాలు Reviewed by Manam Telugu Vaaram on 3:06 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.