అన్ని తెలుగు వార్తల సమాహారం

AP Jobs: ఏపీలో వాలంటీర్ ఉద్యోగాలు... అప్లైకి నేటి వరకే ఛాన్స్

 

ANDHRA PRADESH GRAMA VOLUNTEER RECRUITMENT 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పలు పథకాలను ప్రజల ఇంటి దగ్గరకు చేర్చేందుకే జగన్ సర్కార్ గ్రామవాలంటీర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేల సంఖ్యలో గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించింది. ఏర్పడుతున్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది ఏపీ ప్రభుత్వం. టెన్త్ అర్హత ఉండి స్థానికంగానే నివాసం ఉంటున్న అభ్యర్థులకు వాలంటీర్ ఉద్యోగం మంచి అవకాశమనే చెప్పవచ్చు. తాజాగా రాష్ట్రంలో మరోసారి వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని శ్రీకాకులం జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో ఖాళీల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో మొత్తం 389 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలకు చెందిన స్థానికులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


AP Jobs: ఏపీలో వాలంటీర్ ఉద్యోగాలు... అప్లైకి నేటి వరకే ఛాన్స్ AP Jobs: ఏపీలో వాలంటీర్ ఉద్యోగాలు... అప్లైకి నేటి వరకే ఛాన్స్ Reviewed by Manam Telugu Vaaram on 2:59 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.