అన్ని తెలుగు వార్తల సమాహారం

Andhra Pradesh: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక ప్రకటన

 

జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.



ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన పథకాలను ఎక్కువ మందికి చేర్చాలన్న లక్ష్యంతో వాటికి దరఖాస్తు చేసుకోవడానికి గుడువును పొడిగించింది. వాస్తవానికి ఆయా పథకాలకు గడువును మొదటగా ఈ నెల 25గా నిర్ణయించారు. అయితే గడువు ముగిసినా అనేక మంది విద్యార్థులు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేక పోయారు. దీంతో వినతులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 వరకు గడువును పొడిగించింది.  విద్యార్థులంతా ఈ తేదీ వరకు ఆయా పథకాలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటి వరకు ఆయా పథకాలకు అప్లై చేసుకోలేక పోయిన విద్యార్థులు తల్లిదండ్రుల నంచి హర్షం వ్యక్తమవుతోంది.  ఈ పథకాల కింద విద్యార్థులకు ఆయా కోర్సుల ప్రకారం రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు హాస్టల్ ఫీజును సర్కార్ అందిస్తుంది. విద్యా దీవెన పథకం కింద ఫీజును సర్కార్ రీయింబర్స్మెంట్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. ఏపీలోని మహిళల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమచేయనుంది జగన్ ప్రభుత్వం. పిల్లలను కాలేజీలకు పంపించే తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమకానున్నాయి. ఇందుకు సీఎం వైఎస్ జగన్ ముహూర్తం ఖరారు చేశారు. జగనన్న విద్యాదీవెనపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వాలని చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఏప్రిల్ 27న వసతిదీవెన డబ్బులు జమచేయాలని సూచించారు. ఆయా రోజుల్లో ఈ ఏడాదికి సంబంధించి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన, వసతి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకాల ద్వారా దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది

నవరత్నాలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను సులభంగా అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. నాలుగు త్రైమాసికాలకు డబ్బు ఇస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి సంబంధిత ఫీజు కట్టాల్సి ఉంటుంది. తల్లిదండ్రులే నేరుగా ఫీజులు నేరుగా చెల్లించడం వలన కాలేజీల్లో విద్యాబోధన, సౌకర్యాలు, ఇతర వసతుల గురించి తెలుసుకునేందుకు వీలు పడుతుంది. ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కారం అధికారులు దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది.
Andhra Pradesh: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక ప్రకటన Andhra Pradesh: ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగన్ సర్కార్ కీలక ప్రకటన Reviewed by Manam Telugu Vaaram on 2:56 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.