అన్ని తెలుగు వార్తల సమాహారం

మోడలింగ్ అవకాశాల కోసం చూస్తున్న యువతి.. అంతలోనే ఇన్‌స్టా ఫ్రెండ్ నుంచి ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

 

మోడలింగ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అడిషన్స్ పేరిట ఆమెను ఓ వ్యక్తి హోటల్ రూమ్‌కు రప్పించాడు. అక్కడ తన ప్లాన్‌ను అమలు చేశాడు.



మోడలింగ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అడిషన్స్‌కు పేరుతో ఆమెను నమ్మించిన ఓ వ్యక్తి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని విభూతి ఖండ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. వివరాలు.. 23 ఏళ్ల బాధిత యువతి మోడలింగ్ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే లక్నో నగరానికి చెందిన ఓ జ్యూవెల్లర్ వాసు సోని ఆమెతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేశాడు. ఓ వీడియో అల్బమ్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని.. అందులో అవకాశం కల్పిస్తామని చెప్పాడు. ఇందుకోసం నగర శివార్లలోని ఓ హోటల్‌కు రావాల్సిందిగా కోరాడు. దీంతో ఆ యువతి హోట‌ల్‌కు వెళ్లింది. అక్కడ ఆమెతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత.. వాసు ఆమెను గదిలో బంధించాడు. అనంతరం ఆమెను రేప్ చేశాడు.

ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించినట్టుగా పేర్కొంది. నిందితుడు తనపై అత్యాచారానికి పాల్పడటంతో పాటుగా తీవ్రంగా కొట్టాడని తెలిపింది. తాను హోటల్ రూమ్ బయటకు వచ్చి ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి పిలిచేసరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పింది. అతడు తనకు ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలో అవకాశం కల్పిస్తానని నమ్మించాడని పేర్కొంది. వారం రోజుల కిందట తన స్నేహితురాలి ఒకరు ఇదే విధంగా అత్యాచారానికి గురైందని.. కానీ సామాజిక పరిస్థితులకు భయపడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చింది.

నిందితుడు వాసుని అరెస్ట్ చేసినట్టు విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. అతడు సోషల్ మీడియాలో తన పేరు రేయాన్ష్‌గా యువతికి పరిచయం అయ్యాడని చెప్పారు. అతడిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.


మోడలింగ్ అవకాశాల కోసం చూస్తున్న యువతి.. అంతలోనే ఇన్‌స్టా ఫ్రెండ్ నుంచి ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. మోడలింగ్ అవకాశాల కోసం చూస్తున్న యువతి.. అంతలోనే ఇన్‌స్టా ఫ్రెండ్ నుంచి ఫోన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. Reviewed by Manam Telugu Vaaram on 2:52 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.