అన్ని తెలుగు వార్తల సమాహారం

Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్... రేపటి నుంచే

 

Special Trains | తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఏఏ రూట్స్‌లో స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయో తెలుసుకోండి.


భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్ల సంఖ్యను పెంచుతోంది. ఏప్రిల్ 1 నుంచి మరిన్ని రైళ్లను దేశవ్యాప్తంగా నడపనుంది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి
రైలు నెంబర్ 07207 విజయవాడ నుంచి సాయినగర్ షిరిడీకి వెళ్తుంది. ఈ రైలు దారిలో మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజిపేట్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్ జంక్షన్, జహీరాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.
 రైలు నెంబర్ 07208 సాయినగర్ షిరిడీ నుంచి విజయవాడ వెళ్తుంది. ఈ రైలు దారిలో జహీరాబాద్, వికారాబాద్ జంక్షన్, శంకర్‌పల్లి, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్, కాజిపేట్ జంక్షన్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నెంబర్ 02799 విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఈ రైలు దారిలో మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్, కాజిపేట్ జంక్షన్‌లో ఆగుతుంది.
రైలు నెంబర్ 02800 సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది. ఈ రైలు దారిలో కాజిపేట్ జంక్షన్‌, వరంగల్, కేసముద్రం, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నెంబర్ 02739 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది. ఈ రైలు దారిలో వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, అనకాపల్లి, దువ్వాడలో ఆగుతుంది.
రైలు నెంబర్ 02740 సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నెంబర్ 07239 గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తుంది. ఈ రైలు దారిలో పెదకాకాని, నంబూరు, మంగళగిరి, విజయవాడ జంక్షన్, నూజివీడు, పవర్‌పేట్, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, నిడదవోలు జంక్షన్, గోదావరి, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట జంక్షన్, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడలో ఆగుతుంది.
రైలు నెంబర్ 07240 విశాపట్నం నుంచి గుంటూరు వెళ్తుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం రోడ్, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట జంక్షన్, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, గోదావరి, నిడదవోలు జంక్షన్, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, పవర్‌పేట్, నూజివీడు, విజయవాడ జంక్షన్, మంగళగిరి, నంబూరు, పెదకాకానిలో ఆగుతుంది.
రైలు నెంబర్ 02734 గూడూరు నుంచి విజయవాడకు, రైలు నెంబర్ 02644 విజయవాడ నుంచి గూడూరుకు వెళ్తుంది.
రైలు నెంబర్ 07247 ధర్మవరం నుంచి నర్సాపూర్ వెళ్తుంది. ఈ రైలు దారిలో పాలకొల్లు, విరవసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ జంక్షన్, తరిగొప్పుల, విజయవాడ జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, మదనపల్లి రోడ్, ములకలచెరువు, ముదిగుబ్బలో ఆగుతుంది.
 రైలు నెంబర్ 07248 నర్సాపూర్ నుంచి ధర్మవరం వెళ్తుంది. ఈ రైలు దారిలో ముదిగుబ్బ, ములకలచెరువు, మదనపల్లి రోడ్, పాకాల జంక్షన్, తిరుపతి, రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, తరిగొప్పుల, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, విరవసరం, పాలకొల్లులో ఆగుతుంది


Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్... రేపటి నుంచే Special Trains: తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని స్పెషల్ ట్రైన్స్... రేపటి నుంచే Reviewed by Manam Telugu Vaaram on 11:33 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.