విశాఖలో ఘోరం.. భార్య లేని జీవితం తనకొద్దంటూ.. నిద్రపోతున్న ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. ఓ భర్త చేసిన దారుణమిది..
విశాఖపట్టణంలో ఘోరం జరిగింది. రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించిన భార్యనే తలచుకుంటూ ఓ భర్త కుంగిపోయాడు. క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకున్నాడు. నిద్రపోతున్న ఇద్దరు పిల్లలకు ఉరి వేసి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పట్టణం జిల్లాలో ఘోరం జరిగింది. రెండు నెలల వ్యవధిలోనే ఓ కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా పోయారు. అనారోగ్యంతో ఒకకరు, క్షణికావేశంలో మనోవ్యధతో చేసిన తప్పుతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ కుటుంబంలో వరుసగా జరిగిన పరిణామాలను దగ్గరుండి మరీ చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. విశాఖపట్టణంలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణంలోని అనకాపల్లి మత్రాసు కాలనీలో కొక్కిరి సత్యనారాయణ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. భార్య పుష్పలత, పదేళ్ల కొడుకు లోకేష్, తొమ్మిదేళ్ల మరో కుమారుడు తేజతో కలిసి రెండు నెలల క్రితం వరకు హ్యాపీగా జీవించాడు. కుటుంబంలో ఏమాత్రం కలహాలు లేకుండా సంతోషంగా ఉండేవాళ్లు.
కానీ వారి కుటుంబంలో రెండు నెలల క్రితం ఓ ఘోరం జరిగింది. ఆ ఘోరమే కుటుంబంలో కల్లోలాన్ని రేపింది. సత్యనారాయణ భార్య పుష్పలత రెండు నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి వరకు తమతో సంతోషంగా ఉన్న భార్య కళ్ల ముందు కనిపించకపోవడంతో భర్త సత్యనారాయణ, ఇద్దరు పిల్లలు తీవ్ర మనస్తాపాని గురయ్యారు. ఇతర బంధువులు వచ్చి ఓదార్చడమయితే చేశారు కానీ, భార్యపై ఉన్న ప్రేమ వల్ల ఓరిమి పట్టలేకపోయాడు. భార్య గుర్తుకు వస్తోందంటూ పదే పదే ఏడ్చేవాడు. నువ్వు లేకుండా పిల్లలను ఎలా పెంచి పెద్ద చేయాలంటూ ఏడ్చేవాడు

ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆదమరచి నిద్రపోతున్న ఇద్దరు పిల్లలను ఉరి వేసి ముందుగా చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని చనిపోయాడు. తెల్లారినా కూడా ఆ ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చింది. వెళ్లి చూస్తే లోపల గడియపెట్టి ఉంది. కిటికీల్లోంచి చూస్తే ఇంట్లో చోటుచేసుకున్న దారుణం బయటపడింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి వారి మృతదేహాలను కిందకు దించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆ మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
విశాఖలో ఘోరం.. భార్య లేని జీవితం తనకొద్దంటూ.. నిద్రపోతున్న ఇద్దరు పిల్లలకు ఉరి వేసి.. ఓ భర్త చేసిన దారుణమిది..
Reviewed by Manam Telugu Vaaram
on
11:27 AM
Rating:
Reviewed by Manam Telugu Vaaram
on
11:27 AM
Rating:

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know