అన్ని తెలుగు వార్తల సమాహారం

జనసేనతో వైసీపీకి ముప్పేనా.. దివాలా ఆంధ్రాగా ఏపీ మారింది: రఘురామ

 వైసీపీ రెబల్ ఎంపీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ సీఎం కామెంట్స్ గురించి ప్రస్తావించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను సీఎంగా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనినిబట్టి చూస్తే తమ పార్టీకి ప్రమాదం ఉందనే అనుమానం కలుగుతుందని రఘురామకృష్ణంరాజు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదని ఆయన తెలిపారు.




రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండనుందని రఘురామ అన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి కనీసం మాటకూడా మాట్లాడడం లేదన్నారు. మరో రోమ్ చక్రవర్తిని ఎన్నుకున్నామనే భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఎద్దేవా చేశారు. రుణ ఆంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారే అవకాశాలు తొందరలో ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుందన్నారు.

తిరుపతి వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటన్నారు. స్వామివారి డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. ఇన్నిరోజులు ఎర్రచందనం, ఇప్పుడు తలనీలాలు దొంగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఎవరి ఒత్తిడి అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయమని త్వరలో లేఖ రాస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. సీఎం చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసును ఇన్నిరోజులయిన చేధించకపోవడం బాధాకరమని ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.



జనసేనతో వైసీపీకి ముప్పేనా.. దివాలా ఆంధ్రాగా ఏపీ మారింది: రఘురామ జనసేనతో వైసీపీకి ముప్పేనా.. దివాలా ఆంధ్రాగా ఏపీ మారింది: రఘురామ Reviewed by Manam Telugu Vaaram on 11:23 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.