అన్ని తెలుగు వార్తల సమాహారం

Andhra Pradesh: నేటితో ముగుస్తున్న నిమ్మగడ్డ పదవీ కాలం? వాట్ నెక్స్ట్

 

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం నేటితో ముగుస్తోంది. అయన పదవి నుంచి తప్పుకున్నా ఎప్పటికీ ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకంగానే నిలిచిపోతారు. ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసినా ఎన్నికలు నిర్వహించి అందరి ఫోకస్ తనపై పడేలా చేసుకున్నారు. మరి తరువాత ఏం చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది


ప్రతి రాష్ట్రానికి  ఎన్నికల కమిషన్లు వస్తుంటారు? పోతుంటారు? ముఖ్యంగా ఎన్నికల సమయంలోనే వారు వార్తల్లో నిలుస్తారు. తరువాత ఎక్కడా హైలైట్ కారు.. కానీ ప్రస్తుతం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ట్రెండ్ సెట్ చేశారు. ఏపీ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధమే చేశారు. మొదట కరోనా వేగంగా విస్తరిస్తోంది అంటూ ఎన్నికలను అకస్మాత్తుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిలిపివేశారు. అక్కడితో మొదలైంది అసలైన  యుధ్ధం. తమకు మాట మాత్రమైనా చెప్పకుండా ఎన్నికలను ఎలా రద్దు చేస్తారు అంటూ సీఎం జగన్ నేరుగా ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక కులానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్వయానా సీఎం ఆరోపించడంతో.. అప్పటి నుంచి  నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైలైట్ అవుతూ వచ్చారు.

తరువాత ఆయన ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైతే వైసీపీ ప్రభుత్వం మాత్రం నో అని అంది.. ఎన్నికలు నిర్వహిస్తే సహకరించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అధికారులు సైతం సహాయ నిరాకరణ చేశారు. ఎస్ఈసీ ఎన్నిసార్లు సమావేశాలకు పిలిచినా అధికారులు ఎవరూ హాజరు కాలేదు. సీఎస్ సైతం నిమ్మగడ్డ తీరుకు వ్యతిరేకంగా పదే పదే లేఖలు రాస్తూ వచ్చారు. ఇలా ఏపీ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్న విధంగా వ్యవహారం తయారైంది. అయితే ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు. కోర్టును ఆశ్రయించి మరి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసుకున్నారు.  కోర్టు తీర్పుతో ప్రభుత్వం, అధికారులు సైతం మెట్టు దిగక తప్పలేదు.
పట్టుపట్టి మరీ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. అయితే ప్రభుత్వంతో యుద్ధం ఆగలేదు. మధ్యలో మంత్రలు పెద్ది రెడ్డి, కొడాలి నానిల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ఆయన.. ఆ ఇద్దరిని ఎన్నికల సమయంలో హౌస్ అరెస్ట్ చేయాలి అంటూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. అయితే మంత్రులు కోర్టున ఆశ్రియించి.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే లా చేశారు.  అప్పటికే మంత్రులు, ఎస్ఈసీ మధ్య గ్యాప్ పెరగడంతో.. మంత్రులు నేరుగా నిమ్మగడ్డపై ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేశారు. కచ్చితంగా హాజరు అవ్వాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే వాటిపైనా  నిమ్మగడ్డ తనదైన స్టైల్లో స్పందించారు. తాను వ్యాక్సినేషన్ తీసుకన్న కారణంగా బయటకు రాలేను అని.. అయితే ప్రివిలేజ్ పరిధిలోకి తాను రానని స్పష్టం చేశారు. ఇంకా ఆ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాలి అనుకుంటే తాను ఆధారలతో సహా మాట్లాడాల్సి వస్తుంది అంటూ సవాల్ విసిరారు.

అక్కడితోనే ఆగని ఎస్ఈసి.. తాజాగా కోర్టును ఆశ్రయించారు. తాను గవర్నర్ కు రాసిన లేఖలు లీకు అవుతున్నాయని.. దీనికి బాధ్యులుగా మంత్రులపై ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే ఇద్దరు మంత్రులకు  హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.  ఇలా ఇంకా ప్రభుత్వం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం తన సెలవులను రద్దు చేసుకుని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహించాలని డిమాండ్ చేసింది. కానీ అందుకు ఆయన ససేమిరా అన్నారు. తన పదవీ కాలం ముగుస్తున్న సమయంలో తాను  ఎన్నికలు నిర్వహించలేనని స్పష్టం చేశారు.

నేటితో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగుస్తోంది. ఆయన పదవి నుంచి తప్పుకుంటూ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉంది. మరోవైపు నిమ్మగడ్డ స్థానంలో  కొత్త ఎస్ఈసీగా మాజీ సీఎస్ నీలం సాహ్నీని నియమించింది ప్రభుత్వం. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. దీంతో నీలం సాహ్నీఏప్రిల్ ఒకటి నుంచే  కొత్త ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.  మరోవైపు ఆమె తాడాపల్లి క్యాంప్ ఆఫీసులు సీఎం జగన్ కు కలిశారు.

Andhra Pradesh: నేటితో ముగుస్తున్న నిమ్మగడ్డ పదవీ కాలం? వాట్ నెక్స్ట్ Andhra Pradesh: నేటితో ముగుస్తున్న నిమ్మగడ్డ పదవీ కాలం? వాట్ నెక్స్ట్ Reviewed by Manam Telugu Vaaram on 11:37 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.