అన్ని తెలుగు వార్తల సమాహారం

Dr. Rajasekhar మర్మాణువు: యాంగ్రీ స్టార్ డిఫరెంట్ సబ్జెక్ట్.. వెరైటీ టైటిల్‌తో కొత్త సినిమా

 

''గరుడ వేగ, కల్కి'' సినిమాలతో అలరించిన సీనియర్ హీరో రాజశేఖర్ మరో డిఫరెంట్ సినిమాలో నటిస్తున్నారు. 'మర్మాణువు' అనే వెరైటీ టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.




నేటితరం కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరోలు. ఈ లిస్టుతో ఒకరైన యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఇటీవలే ''గరుడ వేగ, కల్కి'' సినిమాలతో హిట్స్ అందుకొని ఇప్పుడు మరో డిఫరెంట్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి 'మర్మాణువు' అనే డిఫరెంట్ టైటిల్ ఖరారు చేస్తూ టైటిల్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. ''కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది.

ఈ టైటిల్ పోస్టర్‌లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ఒక్క లుక్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిందనే చెప్పుకోవాలి. పోస్టర్, టైటిల్ ద్వారా ఈ స్టోరీ డిఫరెంట్‌గా ఉండనుందని చెప్పేశారు మేకర్స్. ఈ సినిమాను రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారని తెలిపిన నిర్మాతలు సినిమాకు మంచి టైటిల్ కుదిరిందని అన్నారు. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని, ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందని చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. మొత్తానికైతే ఈ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని రాజశేఖర్ కొత్త సినిమాపై పెట్టారని చెప్పుకోవచ్చు.


Dr. Rajasekhar మర్మాణువు: యాంగ్రీ స్టార్ డిఫరెంట్ సబ్జెక్ట్.. వెరైటీ టైటిల్‌తో కొత్త సినిమా Dr. Rajasekhar మర్మాణువు: యాంగ్రీ స్టార్ డిఫరెంట్ సబ్జెక్ట్.. వెరైటీ టైటిల్‌తో కొత్త సినిమా Reviewed by Manam Telugu Vaaram on 3:52 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.