కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మంగళవారం రాష్ట్రంలోని మిద్నాపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తృణమూల్ పార్టీపై మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
‘‘మే 2 తర్వాత పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చట్టాలను ప్రయోగిస్తాం. వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం’’ అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
బీజేపీ కార్యర్తలపై టీఎంసీ నేతలు అనేక దాడులకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో గూండా పాలన కొనసాగుతోందని యోగి అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు కారణం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని, ఆమె ప్రోత్భలంతోనే యధేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే బంగారు బెంగాల్‌ను తీర్చిదిద్దుతామని యోగి హామీ ఇచ్చారు.
Reviewed by Manam Telugu Vaaram
on
3:18 PM
Rating:

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know