అన్ని తెలుగు వార్తల సమాహారం

ఎన్టీఆర్‌ కూడా ముందుగానే ఫిక్స్‌ చేసేశాడు..!

 








యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్న ఎన్టీఆర్‌ నెక్ట్స్ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సర్వం సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నాడు. అయితే కోవిడ్‌ ప్రభావంతో స్టార్‌ హీరోలందరూ వారి సినిమాల విడుదల తేదీలను నిర్ణయించుకుని ముందుగానే అనౌన్స్‌ చేస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పటికే టాలీవుడ్‌ రిలీజ్‌ క్యాలెండర్‌ ఈ ఏడాది నిండిపోయింది. అయితే మన స్టార్‌ హీరోలు వచ్చే ఏడాది కూడా తమ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను బుక్‌ చేసేసుకుంటున్నారు. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్‌కళ్యాణ్‌.. 'హరిహర వీరమల్లు', మహేశ్‌.. 'సర్కారువారిపాట' చిత్రాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి బాటలోనే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కూడా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న 'సలార్‌' చిత్రాన్ని.. ఆగస్ట్‌ 11న 'ఆదిపురుష్‌' చిత్రాలను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. 


ఇప్పుడు వీరి బాటలోకి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా అడుగుపెట్టారు. త్రివిక్రమ్‌ సినిమాను వచ్చ ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట. కాబట్టి ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ ఆర్‌ పూర్తి అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్రివిక్రమ్‌ సినిమా కోసం డేట్స్‌ను కేటాయిస్తాడట.  సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 13న ప్రారంభం కాబోతుంది. ఏప్రిల్‌ నెలలో వారం పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఎన్టీఆర్‌ మే, జూన్‌ నెలల్లో సినిమా కోసం పూర్తిగా డేట్స్‌ కేటాయిస్తాడని సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఎన్టీఆర్‌ కూడా ముందుగానే ఫిక్స్‌ చేసేశాడు..! ఎన్టీఆర్‌ కూడా ముందుగానే ఫిక్స్‌ చేసేశాడు..! Reviewed by Manam Telugu Vaaram on 3:12 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.