అన్ని తెలుగు వార్తల సమాహారం

ముఖ్యమంత్రిగా మెగాపవర్‌స్టార్‌..!


మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైనప్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో కలిసి పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి చేయగానే వెంటనే స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో  మరో పాన్‌ ఇండియాను ట్రాక్‌ ఎక్కించడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు నిర్మాతగా శంకర్‌ తెరకెక్కించబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుందనే న్యూస్‌ హల్‌చల్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్తొకటి నెట్టింట చక్కర్లుకొడుతుంది. కమర్షియల్‌ పేరామీటర్‌ మిస్‌ కాకుండా ప్రస్తుత రాజకీయాలు, ప్రజలు, ఇతర సామాజిక అంశాలలో జరిగే తప్పులను ప్రశ్నించేలా సినిమాలు చేయడం దర్శకుడు శంకర్‌ అలవాటు. చరణ్‌తో చేయబోయే సినిమాలో శంకర్‌ అదే ప్యాట్రన్‌ను ఫాలో కాబోతున్నాడని టాక్‌ వినిపిస్తోంది. రామ్‌చరణ్‌ను డైరెక్టర్‌ శంకర్‌ ఓ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ చీఫ్‌ మినిస్టర్‌ పాత్రలో చూపించబోతున్నారట. మరి నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వార్తలపై మెగా క్యాంప్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

 

ముఖ్యమంత్రిగా మెగాపవర్‌స్టార్‌..! ముఖ్యమంత్రిగా మెగాపవర్‌స్టార్‌..! Reviewed by Manam Telugu Vaaram on 12:53 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.