అన్ని తెలుగు వార్తల సమాహారం

మోదీ టూర్‌లో రాజకీయ మెసేజ్‌!



ఢాకా, మార్చి 27: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చను రేపింది. బంగ్లాదేశ్‌ నుంచి వలసొచ్చి పశ్చిమబెంగాల్‌లో స్థిరపడ్డవారు అనేకమంది ఉన్నారు. ముఖ్యంగా 1971 యుద్ధం తరువాత తూర్పు పాకిస్థాన్‌ విడివడి బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించినపుడు ఈ వలసలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకున్నాయి. బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య సరిహద్దుల మీదుగా ఇప్పటికీ రోజూ వందల మంది బంగ్లాదేశీలు పనుల నిమిత్తం వచ్చిపోతూంటారు. బెంగాల్‌లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడానికి కారణాల్లో ఈ వలసలు కూడా ఒకటి. ఈ ముస్లింలంతా ఒకప్పుడు లెఫ్ట్‌కు, తరువాత తృణమూల్‌కు గట్టి ఓట్‌బ్యాంక్‌గా మారారు. దీన్ని ఛేదించేందుకు హిందూ ఓట్లను సంఘటితం చేసేందు కు బీజేపీ ఈ వలసొచ్చినవారిని టార్గెట్‌ చేసింది. వీరం తా చొరబాటుదారులని, అధికారంలోకొస్తే వారిని ఏరేస్తామని అమిత్‌ షా పదేపదే ప్రకటిస్తూ వచ్చారు. మోదీ ఆ స్వరాన్నే ఇంచుమించుగా వినిపించారు. అయితే ఎన్నికల సమయంలో ఆ దూకుడును ఇద్దరూ అంతగా ప్రదర్శించలేదు. ఆ వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపకుండా మోదీ బంగ్లాదేశ్‌ పర్యటనకు ఇదే సమయాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఆయన బంగబంధుగా పేర్గాంచి, హత్యకు గురైన మాజీ అధ్యక్షుడు షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ సమాధిని దర్శించి నివాళులర్పించారు. 


ఆయన కుమార్తె, ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూ డా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో తాను సత్యాగ్రహం చేసినట్లు మోదీ గురువారంనాడు పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రధాని ఈశ్వరీపూర్‌లో ఉన్న శతాబ్దాల నాటి శక్తిపీఠం జెశోరేశ్వరీ కాళీమాత ఆలయానికి వెళ్లి పూజ లు జరిపారు. అమ్మవారికి ఓ కిరీటం చేయించి ఇచ్చారు. ఆ కోవెల వద్ద అందరికీ ఉపయోగపడేలా ఓ పెద్ద మండపాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఆ తరువాత గోపాల్‌గంజ్‌లో మతువా వర్గ ప్రజానీకం ఎక్కువగా ఉ న్న ఓరకుండీకి వెళ్లారు. మతువాల ఆరాధ్య గురువు హరిచంద్‌ ఠాకూర్‌ ఆలయం వద్ద ప్రార్థనలు జరిపారు. మతువాలు పశ్చిమ బెంగాల్లో 11 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నారు. వారి ఓట్లు అక్కడ కీలకం. అటు ముస్లింలను, ఇటు హిందూవులను, మతువాలాంటి ప్ర జానీకానికి చేరువయ్యేందుకు ఈ టూర్‌ ద్వారా ఆయన యత్నించారు. మోదీ పర్యటనపై మమత మండిపడ్డారు. ఇది ఉల్లంఘన కాదా? అంటూ నిలదీశారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కోల్‌కతాలో అన్నారు. 

 

మోదీ టూర్‌లో రాజకీయ మెసేజ్‌! మోదీ టూర్‌లో రాజకీయ మెసేజ్‌! Reviewed by Manam Telugu Vaaram on 12:59 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.