అన్ని తెలుగు వార్తల సమాహారం

మధ్యతరగతికి ఇంటి స్థలాలు

 

పట్టణ ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇచ్చేందుకు అవసరమైన భూములను సేకరించాలని సీఎం జగన్‌ జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ని ఆదేశించారు. ప్రతీ పట్టణం/నగరంలో 100 నుంచి 150 ఎకరాలు సేకరించాలన్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రభుత్వ పథకాల పురోగతిపై ఆయన సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకే ఈ ప్లాట్లను అందిస్తుందన్నారు. లేఅవుట్లలో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, యూజీడీ, పార్కులు, ఓపెన్‌ ఎయిర్‌జిమ్‌, వాకింగ్‌ ట్రాక్స్‌, విద్యుత్‌ లైన్లు, పచ్చదనం, స్మార్ట్‌బస్‌స్టాప్‌లు ఉండేలా చర్యలు తీసుకొంటామన్నారు. డిమాండ్‌ని అనుసరించి ఎంఐజీ-1లో 150 చదరపు గజాలు, ఎంఐజీ-2లో 200 చదరపు గజాలు, ఎంఐజీ-3లో 240 చదరపు గజాల ఇంటిస్థలాలతో లేఅవుట్‌లు వేస్తామన్నారు. ఒక కుటుంబానికి ఒక్కటే ప్లాటుని విక్రయించడం జరుగుతుందన్నారు. క్లీన్‌ టైటిల్‌లో ఇళ్ల స్థలాలు విక్రయిస్తామన్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీన తాను గుంటూరులోని వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకొంటున్నానని చెప్పారు. సచివాలయాల ద్వారా అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకొనేలా ముమ్మరంగా ప్రచారం కల్పించాలన్నారు. కరోనా వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ తీసుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ఏప్రిల్‌ 14న వలంటీర్లకు సన్మానం, 16న జగనన్న విద్యాదీవెన, 20న వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ(రైతులకు), 23న పొదుపు సంఘాల మహిళలకు, 28న జగనన్న వసతిదీవెన, మే 14న రైతుభరోసా, 18న మత్స్యకార భరోసా, 25న ఖరీఫ్‌ బీమా కార్యక్రమాలు అమలు చేసేందుకు సన్నాహాలు పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, అర్బన్‌ ఎస్‌పీ అమ్మిరెడ్డి, రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(సచివాలయాలు) పి. ప్రశాంతి, జేసీ(ఆసర) కె.శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు

మధ్యతరగతికి ఇంటి స్థలాలు మధ్యతరగతికి ఇంటి స్థలాలు Reviewed by Manam Telugu Vaaram on 11:48 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.