అన్ని తెలుగు వార్తల సమాహారం

Aranya 2 days collections: ఇలాగైతే పెట్టుబడి వచ్చేది ఎప్పుడు.. 60కోట్ల సినిమాకు మరీ ఇంత తక్కువనా?

 లాక్ డౌన్ అనంతరం అన్ని భాషల్లో కాస్త హడావుడిగా విడుదలైన పాన్ ఇండియా సినిమా అరణ్య. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పుడు ఓ వర్గం ఆడియెన్స్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశాయి. కానీ సినిమా విడుదల అనంతరం అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు నుంచి అయినా కలెక్షన్స్ డోస్ పెరుగుతుందని అనుకుంటే ఒక్కసారిగా తగ్గిపోయాయి.



\
తగ్గుతున్న కలెక్షన్స్ 

ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అరణ్య సినిమాలో రానాతో పాటు విష్ణు విశాల్‌, పులకిత్‌ సామ్రాట్‌, జోయా హుస్సేన్‌ వంటి టాలెంటెడ్ స్టార్స్ నటించారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే ఆడలేదు. మిక్సీడ్ టాక్ రావడంతో కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతున్నాయి.

నాన్ థియేట్రికల్ గా..

 ఈ సినిమాను మొదటి నుంచి కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా సినిమాకు భారీ స్థాయిలో అయితే కలెక్షన్స్ రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఊహించినంత కూడా రాలేదు. సినిమా కోసం దాదాపు 60కోట్లు ఖర్చు చేశారు. అయితే నాన్ థియేట్రికల్ గానే 45కోట్లు వచ్చాయి.

2వ రోజు వచ్చిన షేర్ 

ఇక రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న షేర్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం 26లక్షలు, సీడెడ్ 11లక్షలు, ఉత్తరాంధ్ర 11లక్షలు, ఈస్ట్ 6లక్షలు, వెస్ట్ 3లక్షలు, గుంటూరు 4.2లక్షలు, కృష్ణ 4.1లక్షలు, నెల్లూరు 2లక్షలు. తెలుగు రాష్ట్రాల్లో 2రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 0.67కోట్లు. గ్రాస్ 1.05కోట్లు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ సినిమా 

బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.5కోట్లు. మొదటి రోజే సినిమా1.38కోట్ల షేర్ రాగా ప్రపంచవ్యాప్తంగా సెకండ్ డే 67లక్షల షేర్ మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 12.41కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే పెట్టిన పెట్టుబడి సగంలో సగం వెనక్కి వచ్చేసింది.

సినిమా హిట్టవ్వాలి అంటే

 కానీ థియేట్రికల్ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఓపీనింగ్స్ ను అందుకోలేదు. ఇక ఆదివారంతో ఏదైనా మ్యాజిక్ నెంబర్ వస్తుందో లేదో చూడాలి. మరోవైపు నితిన్ రంగ్ దే సినిమా నుంచి పోటీ ఎక్కువవుతోంది. సినిమా హిట్టవ్వాలి అంటే వీకెండ్ అనంతరం కూడా కలెక్షన్స్ అందుకోవాలి. మరి ఆ విషయంలో రానా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.



Aranya 2 days collections: ఇలాగైతే పెట్టుబడి వచ్చేది ఎప్పుడు.. 60కోట్ల సినిమాకు మరీ ఇంత తక్కువనా? Aranya 2 days collections: ఇలాగైతే పెట్టుబడి వచ్చేది ఎప్పుడు.. 60కోట్ల సినిమాకు మరీ ఇంత తక్కువనా? Reviewed by Manam Telugu Vaaram on 11:50 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.