చివరకు జగన్ చెప్పింది నిజమైందా అవును చివరకు జగన్ చెప్పిందే నిజమయింది ఒప్పుకున్న టిడిపి మీడియా
చివరకు జగన్ చెప్పింది నిజమైందా అవును చివరకు జగన్ చెప్పింది నిజమైందా ఒప్పుకున్న టిడిపి మీడియా కరోనా వ్యాప్తి విషయములో జగన్మోహన్రెడ్డి ఆందోళనే నిజమైంది .కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్వహించలేని ప్రభుత్వం చెప్పింది . అయినా సరే ఎలక్షన్స్ జరగవలసిందే అని మాజీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ గట్టిగా పట్టుబట్టారు. పైగా రాష్ట్రంలో కోవిడ్ సమస్య తగ్గిపోయిందని , ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని నిమ్మగడ్డ కోర్టుకెక్కారు. కోర్టు కూడా నిమ్మగడ్డ వాదననే బలపరిచింది .తన వాదనకు మద్దతుగా బీహార్ ,తెలంగాణ లో జరిగిన ఎన్నికలను ఉదాహరణలుగా చూపిస్తే ,కోర్టు కూడా అప్పట్లో అవునంది. అప్పట్లో చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా జగన్ యొక్క వాదనని తప్పుబట్టాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అధికార పార్టీ భయపడుతుంది అంటూ ఎగతాళి చేశాయి .వీళ్ళకి టీడీపీ కి మద్దతుగా నిలిచే మీడియా కూడా డా జగన్ కి వ్యతిరేకంగా కథనాలను వండి వార్చింది.
సీన్ కట్ చేస్తే కరోనా ఉద్ధృతికి ఉదాహరణగా ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన కారణంగా ఇప్పుడు పచ్చ మీడియా చెబుతుంది .చివరకు జగన్ చెప్పింది నిజమైందా, ఒప్పుకున్న టిడిపి మీడియా కరోనా వ్యాప్తి విషయములో జగన్మోహన్రెడ్డి ఆందోళనే నిజమైంది.ఇప్పుడు పోలింగ్ జరుగుతున్న బెంగాల్ తదితర ప్రదేశాల్లో కరోనా కేసులు పదిహేను వందల శాతం పెరిగిపోయాయని, తమిళనాడులో 69 శాతం ,అస్సాంలో 50% పెరిగిపోయాయని కథనాలు చెబుతున్నాయి. తమిళనాడు, అస్సాంలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఎన్నికలు నిర్వహించడమే అని ఆ పచ్చ మీడియా తేల్చేసింది. నిమ్మగడ్డ మరియు ప్రతిపక్షాలు ఉదాహరణగా చూపించిన బీహార్లో కూడా ఎన్నికల తర్వాత ఇక్కడ కరోనా కేసులు పెరిగిపోయాయని ఇప్పుడు వారు చెప్పడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది .ఎన్నికల ముందు తో పోలిస్తే కరోనా బాధితుల సంఖ్య లక్షలలో పెరిగిపోయింది, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో కూడా వేల సంఖ్యలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అని సదరు మీడియా చెబుతుంది .ఇన్ని లెక్కలు చెప్పిన సదరు మీడియా తిరుపతి ఉప ఎన్నికల పూసే ఎత్తడం లేదు .పైగా అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక్క ముక్క కూడా చెప్పడం లేదు
ఎక్కడో జరిగినా తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు ,ఎన్నికల తర్వాత కేసుల గురించి వివరణ తో సహా చెప్పినా సదరు మీడియా ఏపీలో కేసుల గురించి మాత్రం ఎందుకు రాయలేదు ఎందుకు చెప్పలేదు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలలో జగన్ ఆందోళనే నిజమైందని అంగీకరించాల్సి వస్తుంది అన్న ఏకైక కారణంతో కారణం తోనే ఏపీ ఎన్నికల గురించి మాత్రం ఒక్క లైను కూడా రాయలేదు .మిగిలిన రాష్ట్రాలలో కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణం చెప్పినా ఆ మీడియా మాత్రం ఇప్పుడు జగన్ చేతకానితనం వల్లే ఈ కరోనా కేసులు పెరిగిపోయాయి తేల్చడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know