అన్ని తెలుగు వార్తల సమాహారం

ఏపీలో ఇక అడుగు బయట పెట్టడం కష్టం: ఆ జిల్లాల్లో మరింత దారుణం

 విజయవాడ: రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేడిగాలుల ఉధృతి జనాన్ని ఉక్కిరిబిక్కిరి గురి చేస్తోంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఉక్కపోత దీనికి అదనం. సముద్రం మీదుగా బలంగా వీస్తోన్నవేడి గాలుల వల్ల కోస్తా తీర ప్రాంత ప్రజలను ఠారెత్తిస్తోంది. అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రరూపం దాల్చుతోంది. బయటికి రావాలంటే ఒకటి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఉదయం నుంచే ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పులు చెరుగుతున్నాడు. పగటి పూటే చుక్కులు చూపిస్తున్నాడు. తీవ్ర వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏపీలోని కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాధారణం కంటే ఆరు డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైనట్లు అంచనా వేస్తోన్నారు. ఇదే పరిస్థితి మరి కొద్దిరోజులు కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు.




మరి కొద్దిరోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసాధారణ స్థితిలో ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ప్రస్తుత నెలతో పాటు మేలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని తమ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో అనేక పట్టణాల్లో 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండాకాలం ప్రారంభదశలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంటే.. నడి వేసవి నాటికి దాని తీవ్రత మరింత పెరుగుతుందనే ఆందోళన నెలకొంది.

గురువారం నాడు అత్యధిక పగటి ఉష్ణోగ్రత తిరుపతిలో నమోదైంది. అక్కడ 43.5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత రికార్డయింది. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి తిరుపతి నమోదైన ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే.. 4.6 డిగ్రీల మేర అధికం. నెల్లూరు-42.6, విజయవాడ-42.8, కావలి-41.4, ఒంగోలు-42.3 మేర ఎండ తీవ్రత నమోదు కాగా.. విశాఖపట్నం సాధారణం కంటే కాస్త దిగువకే టెంపరేచర్ రికార్డయింది. అక్కడ 32 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో ఇక అడుగు బయట పెట్టడం కష్టం: ఆ జిల్లాల్లో మరింత దారుణం ఏపీలో ఇక అడుగు బయట పెట్టడం కష్టం: ఆ జిల్లాల్లో మరింత దారుణం Reviewed by Manam Telugu Vaaram on 3:47 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.