జానర్ : యాక్షన్ ఎంటర్‌టైనర్
నటీనటులు : కార్తీ, రష్మిక మందన్న, యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు తదితరులు
నిర్మాణ సంస్థ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు : యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు
దర్శకత్వం : బక్కియరాజ్ కణ్ణన్
సంగీతం : వివేక్- మెర్విన్
ఎడిటర్: రూబెన్
సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్
విడుదల తేది : ఏప్రిల్ 02,2021
కథ
విక్రమ్ సుల్తాన్(కార్తీ) ముంబైలోని ఓ కంపెనీలో రోబోటిక్ ఇంజనీర్. ఆయన తండ్రి సేతుపతి(నెపోలియన్)మాత్రం ఒక డాన్. తన దగ్గర కౌరవులుగా పిలవబడే 100మంది రౌడీలు ఉంటారు. సుల్తాన్‌కు మాత్రం రౌడీయిజం అంటే అసలు నచ్చదు. కానీ అనుకోని సంఘటన వల్ల ఆయన సోదరులుగా భావించే 100 మంది రౌడీల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సుల్తాన్ తన 100 మంది సోదరులతో కలిసి అమరావతిలోని వెలగపూడి గ్రామానికి వెళ్తాడు. అక్కడ రుఖ్మిణి(రష్మికా మందన్నా)ను చూసి ప్రేమలో పడతాడు. కానీ అదే రుక్మిణి ఉన్న గ్రామానికి ఓ పెద్ద సమస్య ఉందని తెలుసుకొని, దానిని పరిష్కరిస్తాడు. అసలు ఆ గ్రామానికి ఉన్న సమస్య ఏంటి? 100 మంది బాధ్యతను సుల్తాన్ ఎందుకు తీసుకున్నాడు? కార్తీ తన కౌరవులతో ఏం చేశాడు? అనేదే మిగతా కథ.
ఎప్పుడూ ప్రయోగాత్మక కథలను ఎంచుకునే కార్తీ.. ఈ సారి కూడా ఓ విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. సుల్తాన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపించాడు. పోరాట సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు. పల్లెటూరి అమ్మాయిగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా అదరగొట్టింది. పూర్తి డీ గ్లామరైజ్డ్ పాత్ర ఆమెది. ఓ కొత్త పాత్రలో రష్మికను చూడొచ్చు. హీరో తండ్రి పాత్రలో నెపోలియన్ తన అనుభవాన్ని చూపించాడు. విలన్ పాత్రలో 'కేజీఎఫ్' ఫేమ్ రామ్ ఫెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే మరో విలన్ నవాబ్ షా కూడా మంచి నటనను కనబరిచాడు. ఇక యోగిబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపున కాకుండా కౌరవుల పక్షాన ఉంటే ఎలా ఉంటుంది? అనే ఒక చిన్న పాయింట్ తీసుకుని ‘సుల్తాన్’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్. వందమంది అన్నయ్యలు ఉన్న ఓ తమ్ముడి కథే ఈ చిత్రం. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. రొటీన్ బ్యాక్ డ్రాప్‌నే నేటి తరానికి కావాల్సిన అంశాలు పెట్టి తెరపై చూపించినట్లు అనిపిస్తుంది.
![‘సుల్తాన్’ మూవీ రివ్యూ](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgISVYBTPSy5Q40bFSAQinX4jUM1bfrna5jrXnU7gmcP1JwpB3S8u9HvY9fQrz07W_OLSv7g8Kn858O5sN9fC7okw05hnsVoT4kUsuM1wiOdsxIO7CGStr6GuQVETxSwGtZbQHRO1N_JM4s/s72-c/sultanmovie.jpg)
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know