అన్ని తెలుగు వార్తల సమాహారం

Job Mela in Vijayawada: మొత్తం 800 ఉద్యోగాలు... విజయవాడలో రేపే ఇంటర్వ్యూలు

 

Job Mela in Vijayawada | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC జాబ్ నోటీస్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి


1. రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. మొత్తం 800 ఖాళీలను భర్తీ చేసేందుకు విజయవాడలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించింది. 
2. మొత్తం 800 ఉద్యోగాలకు విజయవాడ సీఆర్‌డీఏ పరిధిలో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ జరగనుంది. నెల్లూరు జిల్లా శ్రీసిటీలోని సంస్థలో 800 పోస్టుల్ని భర్తీ చేయనుంది రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌. ఇందుకోసం APSSDC సహకారం తీసుకుంటోంది
3. ప్రొడక్ట్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
4. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్ల లోపు ఉండాలి. కేవలం యువతులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి నెలకు రూ.11,120 వేతనం లభిస్తుంది. ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఉచిత భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయి


5. స్కిల్ కనెక్ట్ డ్రైవ్ జరిగే వేదిక: అఖినవ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, 40-27-88/1, లోహియా టవర్స్, నిర్మలా కాన్వెంట్ ఎదురుగా, పటమట, విజయవాడ, సీఆర్‌డీఏ రీజియన్.

6. ఆసక్తి గల అభ్యర్థులు 2021 మార్చి 31 ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులు నెల్లూరు జిల్లా శ్రీ సిటీలోనే ఉన్నాయి. మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు

7. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో జాబ్ నోటీసులు ఉంటాయి. వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు ఈ వెబ్‌సైట్‌లో జాబ్స్ సెర్చ్ చేయొచ్చు. మరిన్ని వివరాలకు 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేయాలి.


Job Mela in Vijayawada: మొత్తం 800 ఉద్యోగాలు... విజయవాడలో రేపే ఇంటర్వ్యూలు Job Mela in Vijayawada: మొత్తం 800 ఉద్యోగాలు... విజయవాడలో రేపే ఇంటర్వ్యూలు Reviewed by Manam Telugu Vaaram on 1:46 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.