అన్ని తెలుగు వార్తల సమాహారం

4 Day Work: వారానికి 4 రోజులు డ్యూటీ... 3 రోజులు వీకాఫ్... ఏప్రిల్ 1న కొత్త రూల్స్ ప్రకటించే ఛాన్స్

 

4 Day Work | కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న కొత్త లేబర్ కోడ్ రూల్స్ ప్రకటించే అవకాశం ఉంది. కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులతో వారానికి నాలుగు రోజులే డ్యూటీ చేయించి మూడు రోజులు వీకాఫ్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్స్ రూపొందించిన సంగతి తెలిసిందే. అందులో వారానికి 4 రోజులు మాత్రమే డ్యూటీ చేయించే అవకాశాన్ని కంపెనీలు, సంస్థలకు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆయా కంపెనీలు, సంస్థలు కోరుకుంటే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
2. కొత్త లేబర్ కోడ్స్‌కు సంబంధించిన వివరాలను కేంద్ర లేబర్ సెక్రెటరీ అపూర్వ చంద్ర వివరించారు. వారానికి ఆరు రోజులు, వారానికి ఐదు రోజులు, వారానికి నాలుగు రోజుల్లో కంపెనీలు, సంస్థలు ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు
3. అంటే కంపెనీలు తమ ఉద్యోగులకు వారానికి 6 రోజులు లేదా వారానికి 5 రోజులు లేదా వారానికి 4 రోజులు పనిచేయించొచ్చు. అయితే పనిగంటల విషయంలో కేంద్ర ప్రభుత్వం లిమిట్ పెట్టింది.
4. వారానికి 6 రోజులు పనిచేయిస్తే రోజుకు 8 గంటలు, వారానికి 5 రోజులు పనిచేయిస్తే రోజుకు 10 గంటలు, వారానికి 4 రోజులు పనిచేయిస్తే రోజుకు 12 గంటలు మాత్రమే పనిచేయించాలి.
5. అంటే మొత్తంగా వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయించాలని కేంద్ర లేబర్ సెక్రెటరీ అపూర్వ చంద్ర వివరించారు. అయితే సంస్థలు తప్పనిసరిగా ఇవే టైమింగ్స్ పాటించాలని, ఉద్యోగులు ఇవే టైమింగ్స్ ఎంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయట్లేదన్నారు.
6. కంపెనీలు పైన వెల్లడించిన మూడు ఆప్షన్లలో ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకోవచ్చు. కానీ వారానికి పనిగంటలు 48 గంటలకు మించకూడదు.
7. వారానికి 6 రోజులు ఎంచుకుంటే ఒక రోజు వీకాఫ్, వారానికి 5 రోజులు ఎంచుకుంటే 2 రోజులు వీకాఫ్, వారానికి 4 రోజులు ఎంచుకుంటే 3 రోజులు వీకాఫ్ ఉద్యోగులకు లభిస్తుంది. వీటిని పెయిడ్ ఆఫ్స్‌గా పరిగణిస్తారు
8. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులు, సామాజిక భద్రత లాంటి అంశాలతో నాలుగు లేబర్ కోడ్స్‌ని రూపొందించింది. ఇందులో నియమనిబంధనల్ని ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత వీటన్నింటినీ ఒకేసారి అమలు చేస్తుంది


4 Day Work: వారానికి 4 రోజులు డ్యూటీ... 3 రోజులు వీకాఫ్... ఏప్రిల్ 1న కొత్త రూల్స్ ప్రకటించే ఛాన్స్ 4 Day Work: వారానికి 4 రోజులు డ్యూటీ... 3 రోజులు వీకాఫ్... ఏప్రిల్ 1న కొత్త రూల్స్ ప్రకటించే ఛాన్స్ Reviewed by Manam Telugu Vaaram on 1:37 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.