అన్ని తెలుగు వార్తల సమాహారం

Hero Nithiin - Rang De: ‘రంగ్ దే’ హిట్‌.. బ్యాన‌ర్‌తో ఉన్న సెంటిమెంట్‌ను గుర్తు చేసుకున్న నితిన్‌..!

 


నితిన్ కథానాయకుడిగా నటించి ఈ నెల 26న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సినిమా ‘రంగ్ దే’. ఈ సినిమాను వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ‘రంగ్ దే’ చిత్రం ఈ సినిమా ప‌క్కాగా హిట్ అవుతుంద‌ని నితిన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. అందుకు కార‌ణంగా ఉన్న సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో ఉన్న సెంటిమెంట్‌ను కూడా వివ‌రించాడు నితిన్‌. ఇంత‌కీ సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్‌తో నితిన్‌కి ఉన్న సెంటిమెంట్ ఎంట‌నే వివ‌రాల్లోకి వెళితే.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో నితిన్ మూడు సినిమాలు చేశాడు.

మూడు సినిమాల్లో మొద‌టిది ‘అఆ’.. ఈ సినిమాకు ముందు నితిన్ ప్లాపుల్లో ఉన్నాడు. ‘అఆ’తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు. అలాగే ఈ బ్యాన‌ర్‌లో నితిన్ చేసిన మ‌రో చిత్రం ‘భీష్మ’‌. ఈ సినిమాకు ముందు కూడా నితిన్ ప్లాప్ మూవీ చేసి ఇబ్బంది ప‌డుతున్నాడు. ఇప్పుడు ఇదే బ్యాన‌ర్‌లో నితిన్ చేసిన మూడో సినిమా ‘రంగ్ దే’. ఈ సినిమాకు ముందు సినిమా ‘చెక్’ సినిమా ప్లాప్ అయ్యింది. ప్లాప్ త‌ర్వాత సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో చేసిన సినిమా కాబ‌ట్టి త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్న‌ట్లు తెలిపాడు నితిన్‌. మ‌రి నితిన్ సెంటిమెంట్ నిజ‌మవుతుందో లేదో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే.

Hero Nithiin - Rang De: ‘రంగ్ దే’ హిట్‌.. బ్యాన‌ర్‌తో ఉన్న సెంటిమెంట్‌ను గుర్తు చేసుకున్న నితిన్‌..! Hero Nithiin - Rang De: ‘రంగ్ దే’ హిట్‌.. బ్యాన‌ర్‌తో ఉన్న సెంటిమెంట్‌ను గుర్తు చేసుకున్న నితిన్‌..! Reviewed by Manam Telugu Vaaram on 12:12 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.