అన్ని తెలుగు వార్తల సమాహారం

CD Scandal: సీడీ లేడీ దెబ్బతో మాజీ మంత్రికి అరెస్టు భయం, మహారాష్ట్రలో ప్రత్యక్షం, నెక్ట్స్?

 బెంగళూరు/ హైదరాబాద్: రాసలీలల సీడీ లేడీ న్యాయమూర్తి ముందు స్టేట్ మెంట్ ఇవ్వడంతో రాసలీలలు సాగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళికి అరెస్టు భయం పట్టుకునింది. న్యాయమూర్తి ముందు పూర్తి వివరాలు వెళ్లడించిన సీడీ లేడీ చెప్పిన పూర్తి సమాచారాన్ని వీడియో రికార్డింగ్ ద్వారా స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిసింది. తరువాత సిట్ అధికారుల సమక్షంలో టెక్నికల్ విభాగం అధికారుల ముందు సీడీ లేడి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఒకే రోజు ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ముందు రాసలీలల సీడీ లేడీ స్టేట్ మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు రాసలీలలు సాగించిన మాజీ మంత్రి రమేష్ జారకిహోళికి అరెస్టు భయం పట్టుకుందని తెలిసింది. మహారాష్ట్రలోని కోల్లాపూర్ లో రమేష్ జారికిహోళి ప్రత్యక్షం అయ్యారు.



ప్రత్యేక కోర్టులో స్టేట్ మెంట్ 

బెంగళూరులోని వసంతనగర్ లోని గురునానక్ భవన్ లోని ప్రత్యేక కోర్టులో హాజరైన సీడీ లేడీ సీక్రెట్ గా బెంగళూరు ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తికి వాగ్మూలం ఇచ్చారు. యువతి ఏం చెప్పింది అనే పూర్తి సమాచారాన్ని ప్రత్యేక కోర్టులో వీడియో రికార్డింగ్ చేశారని తెలిసింది. యువతి చెప్పిన పూర్తి సమాచారాన్ని సీల్డ్ కవర్ లో పెట్టి బుధవారం ప్రత్యేక కోర్టు సిట్ అధికారులకు అప్పగించే అవకాశం ఉందని తెలిసింది


టెక్నికల్ సెల్ లో సీడీ సుందరి స్టేట్ మెంట్ 

ప్రత్యేక కోర్టులో స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత సిట్ ప్రత్యేక దర్యాప్తు అధికారి కవితా వెంట సీడీ లేడీ నేరుగా బెంగళూరులోని ఆడుగోడిలోని టెక్నికల్ విభాగం సెల్ కార్యాలయానికి వెళ్లారు. టెక్నికల్ సెల్ విభాగం అధికారుల ముందు సీడీ లేడీ రాసలీలల వ్యవహారం విషయంలో మొదటి నుంచి ఏం జరిగింది ? అని సమాచారం ఇచ్చారని తెలిసింది.

రాసలీలల సీడీలోని ఆమె ఈమేనా ? 

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించిన సీడీ లేడీ, ఇప్పుడు కోర్టు ముందు, సిట్ అధికారుల ముందు హాజరై స్టేట్ మెంట్ ఇచ్చింది ఒక్కరేనా ?, ఆమె ఈమెనా ? అని నిర్దారించుకోవడానికి ఫోరెన్సిక్ నిపుణుల సహకారం తీసుకోవాలని సిట్ అధికారులు డిసైడ్ అయ్యారు. టెక్నికల్ విభాగంలో సీడీ లేడీ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆడియో, వీడియోను ఫోరెన్సిక్ నిపుణులకు పంపించడానికి సిట్ అధికారులు సిద్దం అయ్యారు.

మాజీ మంత్రికి గుండెల్లో దడదడ 

సీడీ సుందరి ప్రత్యేక కోర్టులో స్టేట్ మెంట్ ఇవ్వడంతో కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో పాటు ఆయన అనుచరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆమె న్యాయమూర్తికి ఏం చెప్పారు అనే విషయం కోర్టు సీక్రెట్ గా పెడుతుంది. సీడీ లేడీ ఏం చెప్పింది ? అనే విషయం అంతు చిక్కకపోవడంతో రమేష్ జారకిహోళికి అరెస్టు భయం పట్టుకుంది.

మహారాష్ట్రలో రమేష్ ప్రత్యక్షం

 మాజీ మంత్రి రమేష్ జారకిహోళి గోకాక్ లోని ఆయన ఇంటికి వెళ్లారు. మంగళవారం మహారాష్ట్రలోని కోల్లాపురలోని శ్రీ మహాలక్ష్మి ఆలయానికి వెళ్లిన రమేష్ జారకిహోళి సుమారు అర్దగంట పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీడీ సుందరి ప్రత్యేక కోర్టు ముందు హాజరైన తరువాత మాజీ మంత్రి రమేష్ జారకిహోళి కోల్లాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆయలంలో ప్రత్యేక పూజలు చేయించారు.

బెంగూరుకు పరుగో పరుగు 

కోల్లాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తరువాత రమేష్ జారకిహోళి మళ్లీ గోకాక్ వచ్చేశారు. బుధవారం రమేష్ జారకిహోళి బెంగళూరు బయలుదేరడానికి సిద్దం అయ్యారని తెలిసింది. బుధవారం బెంగళూరు చేరుకున్న తరువాత తనను పోలీసులు అరెస్టు చెయ్యకుండా ఏం చెయ్యాలి అంటూ లాయర్లతో చర్చించడానికి రమేష్ జారకిహోళి సిద్దం అయ్యారని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తం మీద సీడీ లేడీ కోర్టు ముందు సాక్షం చెప్పడంతో రమేష్ జారకిహోళికి అరెస్టు భయం పట్టుకునిందని తెలిసింది.






CD Scandal: సీడీ లేడీ దెబ్బతో మాజీ మంత్రికి అరెస్టు భయం, మహారాష్ట్రలో ప్రత్యక్షం, నెక్ట్స్? CD Scandal: సీడీ లేడీ దెబ్బతో మాజీ మంత్రికి అరెస్టు భయం, మహారాష్ట్రలో ప్రత్యక్షం, నెక్ట్స్? Reviewed by Manam Telugu Vaaram on 11:09 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.