చికెన్ అంటే ఇష్టపడే యువతి.. శాఖహారం మాత్రమే తినే యువకుడి ప్రేమలో పడింది. అతడి కోసం ఆమె శాఖాహారం మానేసింది. కానీ, సీక్రెట్‌గా తినడం మొదలుపెట్టింది. ఈ చిన్న కారణానికి అతడు పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు.
- శాఖాహారి యువకుడి ప్రేమలో ‘చికెన్’ ప్రియురాలు.
- సీక్రెట్‌గా చికెన్ ఆరగిస్తూ దొరికిపోయిన యువతి.
- ఈ విషయం తెలిసి బాయ్‌ఫ్రెండ్ కీలక నిర్ణయం.
ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందనే సంగతి తెలిసిందే. ప్రేమలో పడిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటం కుదరదు. ఏదో ఒక విషయంలో రాజీ పడాల్సిందే. తమ పార్టనర్‌కు నచ్చిన విధంగా మారిపోవల్సిందే. లేకపోతే.. ఆ ప్రేమ ఎన్నాళ్లో నిలవదు. ఒకవేళ నిలిచినా.. నిత్యం గొడవలతో సాగుతుంది. కానీ, కొందరు ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. తమ పార్టనర్ ముందు అన్నీ తమ అలవాట్లను వదిలేసినట్లే నటిస్తారు. అన్నీ రహస్యంగా ఉంచుతారు. పాపం ఈ యువతి కూడా అదే చేసింది. కానీ, చివరికి బాయ్‌ఫ్రెండ్‌కు ఆ విషయం తెలిసిపోయింది. దీంతో అతడు ఊహించని నిర్ణయం తీసుకుని ఆమెకు షాకిచ్చాడు.
ఓ యువతి ఇటీవల ‘రెడిట్’లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది. ‘‘నేను నా బాయ్‌ఫ్రెండ్.. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అతడితో సహజీవనం చేస్తున్నా. 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి అతడు శాఖాహారిగా ఉంటున్నాడు. ప్రేమలో పడిన తర్వాత అతడు.. నన్ను కూడా శాఖహారిగా మారిపోమన్నాడు. సరేలా, అతడి కోసం ఆ మాత్రం చేయలేనా అని కొన్ని రోజులు శాఖాహారం ప్రయత్నించాను’’.
ఓ యువతి ఇటీవల ‘రెడిట్’లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది. ‘‘నేను నా బాయ్‌ఫ్రెండ్.. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అతడితో సహజీవనం చేస్తున్నా. 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి అతడు శాఖాహారిగా ఉంటున్నాడు. ప్రేమలో పడిన తర్వాత అతడు.. నన్ను కూడా శాఖహారిగా మారిపోమన్నాడు. సరేలా, అతడి కోసం ఆ మాత్రం చేయలేనా అని కొన్ని రోజులు శాఖాహారం ప్రయత్నించాను’’.
‘‘కానీ, శాఖాహారం తినడం అంత సులభం కాదని అర్థమైపోయింది. రోజూ అవి తిని తిని బోరు కొట్టింది. అప్పుడప్పుడు నా చుట్టూ చికెన్ వంటకాలు ఉన్నట్లు, వాటిని ఆవురావురమంటూ తినేస్తున్నట్లు కలలు వచ్చేవి. దీంతో నేను ఆగలేకపోయా. నాకు ఓ ఐడియా వచ్చింది. అతడికి తెలియకుండా నేను ఇంట్లో నుంచి మాయమైపోయి.. మెక్‌డోనల్డ్స్‌కు వెళ్లి తనవితీరా చికెన్ తినడం మొదలుపెట్టా. వారంలో రెండు రోజులు అదే పనిగా పెట్టుకున్నా. నగ్గెట్స్ లేదా మెక్‌చికెన్ తినేదాన్ని’’
‘‘అతడికి అనుమానం కలగకుండా సూపర్ మార్కెట్‌కు వెళ్లి.. నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేదాన్ని. దీంతో అతడు ఆ పని మీదే బయటకు వెళ్తున్నా అనుకొనేవాడు. కొన్ని నెలలు నేను ఇలాగే చేశాను. ఇటీవల అతడికి నా మీద అనుమానం కలిగింది. నువ్వు నన్ను చీటింగ్ చేస్తున్నావని, తనతో కాకుండా ఒంటరిగా బయటకు వెళ్లేందుకే ఇష్టపడుతున్నావని అన్నాడు. ఆ వెంటనే బ్రేకప్ చెప్పేశాడు. నా రిలేషన్‌షిప్ ఇంత దరిద్రంగా ముగుస్తుందని ఏ రోజు అనుకోలేదు. మళ్లీ అతడు నన్ను స్వీకరించాలంటే ఏం చేయాలో చెప్పండి’’ అని రెడిట్ యూజర్లను కోరింది.
ఓర్నీ.. ప్రియురాలు చికెన్ తింటోందని.. బాయ్‌ఫ్రెండ్ షాకింగ్ నిర్ణయం
Reviewed by Manam Telugu Vaaram
on
1:22 PM
Rating:
Reviewed by Manam Telugu Vaaram
on
1:22 PM
Rating:

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know