అన్ని తెలుగు వార్తల సమాహారం

పిల్లులకు తల్లైన కోడి.. కంటికి రెప్పలా కాపాడుతుంది!

 ఓ కోడి మాత్రం ఏకంగా మూడు పిల్లి పిల్లలను అక్కునచేర్చుకొని అచ్చంగా కోడి పిల్లలను పెంచినట్లుగా పెంచడం విస్తుపోయేలా చేస్తుంది. కోడి తాను పెట్టిన గుడ్లను పొడగడం కోసం శరీరం నుండి ఒకరకమైన వేడి ఉత్పత్తి చేస్తూ జాగ్రత్తగా గుడ్ల మీద కూర్చుంటుంది. ఇక్కడ పిల్లి పిల్లల విషయంలో కూడా కోడిపెట్ట అదేవిధంగా తన ఒడిలో చేర్చుకుంది. కోడి నుండి వచ్చే ఆ ఉష్ణాన్ని పిల్లి పిల్లలు సైతం ఆస్వాదిస్తూ హాయిగా సేదదీరుతుండడం విశేషం

సృష్టిలో మాతృత్వానికి మించిన బంధం మరొకటి ఉండదు. బిడ్డలతో తల్లికి ఉన్న బంధాన్ని వర్ణించడానికి ఏ వర్ణనలు సరిపోవు. ఏ భాషకు అందని భావన అదొక్కటే కాగా సృష్టిలో ప్రతిజీవికి సమానమైన మమకారం అదొక్కటే. ఒక జీవికి మరొక జీవిపై వివక్షలు ఎన్ని ఉన్నా మాతృత్వంలో మాత్రం అందరూ సమానమే. మనుషులలో కొందరు అనాథలైన చిన్నారులను అక్కున చేర్చుకొని వారికి మాతృత్వాన్ని అందించడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ ఓ కోడి అనాథలైన పిల్లి పిల్లలకు అమ్మగా మారడం మాత్రం వింతగానే అనిపిస్తుంది. సహజంగా కోళ్లు పిల్లి అరుపు విన్నా.. అవి దగ్గరకు వచ్చినా కాస్త బెరుకుగా ప్రవర్తిస్తాయి. పిల్లులు కూడా కోళ్లకు దూరంగానే ఉంటాయి.

కానీ ఓ కోడి మాత్రం ఏకంగా మూడు పిల్లి పిల్లలను అక్కునచేర్చుకొని అచ్చంగా కోడి పిల్లలను పెంచినట్లుగా పెంచడం విస్తుపోయేలా చేస్తుంది. కోడి తాను పెట్టిన గుడ్లను పొడగడం కోసం శరీరం నుండి ఒకరకమైన వేడి ఉత్పత్తి చేస్తూ జాగ్రత్తగా గుడ్ల మీద కూర్చుంటుంది. గుడ్లు పిల్లలుగా మారిన కొన్ని రోజుల వరకు కోడి పెట్టలు అదే విధంగా చేస్తుంటాయి. ఇక్కడ పిల్లి పిల్లల విషయంలో కూడా కోడిపెట్ట అదేవిధంగా తన ఒడిలో చేర్చుకుంది. కోడి నుండి వచ్చే ఆ ఉష్ణాన్ని పిల్లి పిల్లలు సైతం ఆస్వాదిస్తూ హాయిగా సేదదీరుతుండడం విశేషం. ఈ కోడి పిల్లుల దత్తత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

ఆ వీడియో ప్రకారం కుర్దిష్ రైతు మరియు సైనికుడైన గోరన్ ఎ సుర్చి అనే వ్యక్తి ఓ కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే.. ఒకరోజు ఫారం నుండి మియావ్ మియావ్ అంటూ అరుపులు వినిపిస్తుండడంతో కోళ్లకి ఏదైనా ఆపద ఉంటుందేమో అనే అనుమానంతో ఫారం మొత్తం వెతికాడు. కానీ ఎక్కడ పిల్లులు కనిపించలేదు. మళ్ళీ మరుసటి రోజు కూడా అదే విధమైన పిల్లి అరుపులు వస్తుండడంతో రైతు గోరన్ ప్రతి కోడిని పక్కకి తీస్తూ ఫారం మొత్తం జల్లెడ పట్టడం ప్రారంభించాడు. ఎలాగూ రోజు తన ఫారంలో చేసే పనులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గోరన్ ఫారం వెతకడం కూడా వీడియో తీశాడు.

అలా వెతుకుతూ వెళ్తుండగా ఒక కోడిని పైకి లేపగా ఆశ్చర్యం కలిగించేలా ఆ కోడి కింద పిల్లి పిల్లలు ఉన్నాయి. మొత్తం మూడు పిల్లి పిల్లలు కోడికింద సేదదీరుతున్నాయి. దీంతో ఈ పిల్లులు ఎక్కడ నుండి వచ్చాయని ఆరాతీయగా ఫారానికి దగ్గరలోని సరస్సులో ఒక పిల్లి చనిపోయి ఉండడం కంటపడింది. ఆ చనిపోయిన పిల్లి పిల్లలే ఈ కోడి దగ్గర ఉంది. తల్లి పిల్లి చనిపోవడంతో చలించిన కోడి ఆ మూడు పిల్లులను అక్కునచేర్చుకుంది. ఫారంలో మిగతా కోళ్లతో ఆ పిల్లులకు ఏ ఇబ్బంది రాకుండా కోడి తన రెక్కలతో ఆ పిల్లులకు గూడుకట్టి కంటికి రెప్పలా కాపాడుతుంది. పిల్లులను దత్తత చేసుకున్న కోడి కథను గోరన్ టిక్ టాక్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.




.

పిల్లులకు తల్లైన కోడి.. కంటికి రెప్పలా కాపాడుతుంది! పిల్లులకు తల్లైన కోడి.. కంటికి రెప్పలా కాపాడుతుంది! Reviewed by Manam Telugu Vaaram on 3:18 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.