అన్ని తెలుగు వార్తల సమాహారం

రాష్ట్ర అధినేతను చేయడం అంటే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడమే !

తిరుపతిలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టంగా ఉందన్న ఆయన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి పై చర్చకు వైకాపా, తెదేపా సిద్ధమా? అని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా కేంద్రం చేస్తే వైకాపా ప్రభుత్వం ఏం చేసింది? అని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ అయిన వాళ్లు ఎప్పుడూ ఏమీ చేసింది లేదన్న ఆయన నాలుగు స్తంభాల వ్యూహాన్ని అనుసరిస్తున్నామని అన్నారు. భాజపా చేసిన అభివృద్ధి, గత పాలకుల వైఫల్యాలు ప్రజల్లో కి తీసుకెళ్తున్నామని సీఎం జగన్ కి వ్యక్తిగత సేవలు అందించిన వ్యక్తి...ఎంపీ పోటీకి అర్హుడా? అని ప్రశ్నించారు.

వ్యక్తిగత సేవలు చేసిన వారికి ఇవ్వడానికి నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయని ఆయన అన్నారు. జగన్ సేవ వర్సెస్ జనం సేవ దేన్ని ఎంచుకోవాలో ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. టీడీపీకి, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఇవే ఆఖరి ఎన్నికలన్న ఆయన 40 ఏళ్ల టీడీపీ సంబరాలు... శోక సభల్లా కనిపించాయని అన్నారు. ఆరిపోయిన టీడీపీకి ఆవిర్భవిస్తున్న కూటమి భాజపా- జనసేన అని అన్నారు. విజయసాయిరెడ్డి..సోము వీర్రాజు పై చేసిన ట్వీట్ వైసీపీ భయాన్ని స్పష్టం చేసిందని, 21 మంది ఎంపీలు చేయలేనిది 22వ ఎంపీ చేయగలడా? అని ప్రశ్నించారు. రత్న ప్రభ విజయం తిరుపతి అభివృద్ధికి సోపానమన్న ఆయన సోము వీర్రాజు వ్యాఖ్యలతో అన్ని పార్టీల్లో గుబులు మొదలైందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర అధినేతను చేయడం అంటే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడమేనని రాష్ట్ర అధ్యక్షుడుగా సోము వీర్రాజు పవన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వ్యాఖ్యలే... అందులో అనుమానం వద్దు అని అన్నారు...

అన్ని పార్టీల మాటలు మార్చే పార్టీ బిజెపి కాదన్న ఆయన ఈ ఎన్నికల్లో కాదు... మాతో ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ మా రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థి అనడంలో అనుమానం వద్దని అన్నారు. చంద్రబాబు, లోకేష్ ను వదలి  విజయసాయిరెడ్డి మాపై పడడం ద్వారా మా బలం బయటపడుతోంది..... విజయసాయిరెడ్డి ఏ స్థాయిలో అధినేత మాటలు భయం పుట్టించాయో అర్థం అవుతోందని అన్నారు. హోదా ముగిసిన అధ్యాయం అని పేర్కొన్న ఆయన వైసీపీ, టిడిపిలు ఇంకా హోదా పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నాయన్నారు. ఎవరు గెలిచినా ప్రయోజనం సున్నా... వైకాపా గెలిస్తే మరోక మౌన ఎంపి...టీడీపీ గెలిస్తే వారికి ఒక మూగ ఎంపి వస్తారంతే కానీ బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు.


 

రాష్ట్ర అధినేతను చేయడం అంటే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడమే ! రాష్ట్ర అధినేతను చేయడం అంటే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పడమే ! Reviewed by Manam Telugu Vaaram on 3:12 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.