Chandrababu Naidu విజనరీ అని.. ఆయనంత కష్టపడే నాయకుడు ప్రస్తుత తరంలో మరొకరు లేరని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బాబు అధికారంలో ఉన్నా లేకున్నా తెలివైన వాడని, విజన్ ఉన్నవాడన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా.. తెలివైన వాడు, విజన్ ఉన్నవాడన్నారు. చంద్రబాబును జగన్ ఎలా మర్చిపోయాడనేది ఆశ్చర్యంగా ఉందన్నారు. జగన్ మనస్తత్వం దృష్ట్యా చంద్రబాబుపై ఇంతకు ముందే కేసులు నమోదు చేస్తారని భావించానన్నారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూశాక.. సమీప భవిష్యత్తులో జగన్‌కు ఎదురొచ్చే నాయకుడు లేడని జేసీ అభిప్రాయపడ్డారు. సేవ్ తాడిపత్రి పేరిట తాము జగన్‌కు ఎదురొడ్డామన్నారు. తిరుపతి ఉపఎన్నికలోనూ వైసీపీ విజయం సాధిస్తుందని జేసీ జోస్యం చెప్పారు.
చంద్రబాబు, నరేంద్ర మోదీ చేతులు కలపకపోతే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబుతోనే కలిస్తేనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు సహాయ సహకారాలతోనే రాష్ట్రంలో బీజేపీకి మనుగడ సాధ్యమన్నారు.
ప్రభుత్వం వ్యాపారం చేయొద్దని.. వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. తాను ఇప్పటికీ ట్రావెల్స్ నడుపుతున్నానన్న జేసీ.. ప్రజలు నా బస్సుల్లో సీటు దొరక్కపోతేనే ఆర్టీసీ బస్సులో వెళ్తారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల బాగోగులను పట్టించుకునేవారు లేరన్నారు.
తుళ్లూరు ప్రాంత వాసులే రాజధానిగా అమరావతి వద్దనుకున్నప్పుడు తమకొచ్చిన ఇబ్బంది ఏంటని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలను బట్టి.. ఆ ఊరి వాళ్లే రాజధాని అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నారన్నారు. అమరావతిలో ఒక్క కమ్మవాళ్లే భూములు కొన్నారా..? ఎక్కువ మంది వాళ్లు కొని ఉంటే కొని ఉండొచ్చన్నారు.
షర్మిల మంచి అమ్మాయంటూ ప్రశంసలు గుప్పించిన జేసీ.. తెలంగాణలో ఆమె వార్మప్ అవుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లేనని జేసీ తెలిపారు.
షర్మిల మంచి అమ్మాయంటూ ప్రశంసలు గుప్పించిన జేసీ.. తెలంగాణలో ఆమె వార్మప్ అవుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లేనని జేసీ తెలిపారు.
చంద్రబాబు విజనరీ, తెలివైనోడు కానీ.. జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Reviewed by Manam Telugu Vaaram
on
1:42 PM
Rating:

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know