తన ముద్దుముద్దు మాటలతో పోలీసులకు షాకిచ్చాడు ఓ బాలుడు. తన అమ్మ, అక్క, తాత తప్పిపోయారని, వెతికి పెట్టాలని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు.
ప్రధానాంశాలు:
- పోలీసులకు షాకిచ్చిన బాలుడు
- తనవాళ్లు తప్పిపోయారని వెతికి పెట్టాలని ఫిర్యాదు
- తాత ఎంట్రీతో జరిగింది తెలుసుకున్న పోలీసులు
పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటే పెద్దలే భయపడుతుంటారు.. అలాంటిది ఇంకా మాటలు కూడా సరిగ్గా రాని బాలుడు స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో ధైర్యంగా మాట్లాడి ముగ్ధులను చేశాడు. ‘అమ్మా, నేను, అక్క, తాత ఆటోలో వచ్చాం.. వాళ్లు తప్పిపోయారు’ అంటూ వచ్చీరాని మాటలతో చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది.
కుత్బుల్లాపూర్ కొంపల్లి బ్యాంక్ కాలనీలో గోవర్ధన్‌రావు కుటుంబంతో కలిసి ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఆయన మనవడు ఆడుకునేందుకు బయటకు వెళ్లి తప్పిపోయాడు. కేవీఆర్ గార్డెన్ ముందు ఏడుస్తూ కనిపించిన బాలుడిని చూసిన స్థానికులు డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో పేట్‌బషీరాబాద్ పోలీసులు వచ్చి బాలుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు.
పోలీసులను చూసి అదురుబెదురు లేకుండా ఉన్న బాలుడు వచ్చీరాని మాటలతో వాళ్లని ఆకట్టుకున్నాడు. ఆ బాలుడి అమాయకపు మాటలకు ముగ్ధుడైన సీఐ బాలుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని వివరాలు ఆరా తీశారు. తన తాత పేరు గోవర్ధన్‌రావు అని, తాను ఎల్‌కేజీ చదువుతున్నానని చెప్పాడు. అదే సమయంలో మనవడు తప్పిపోయాడని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అతడి తాత బాలుడిని చూసి షాకయ్యాడు. గోవర్థన్‌రావు నుంచి వివరాలు సేకరించిన పోలీసులు చివరికి బాలుడిని తాతకు అప్పగించారు.
అమ్మ, అక్క, తాత తప్పిపోయారు’... పోలీసులకు షాకిచ్చిన బుడ్డోడు
Reviewed by Manam Telugu Vaaram
on
1:34 PM
Rating:
Reviewed by Manam Telugu Vaaram
on
1:34 PM
Rating:

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know