ఇద్దరు అగ్ర హీరోలు కలిస్తే అభిమానులు ఎంతగా సంతోషిస్తారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టాలీవుడ్ లో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోలు ఒకరిపై మరొకరు స్పందిస్తే కూడా ఆ కిక్కు మామూలుగా ఉండదు. హీరోలు ఎంత సంతోషిస్తారో గాని అభిమానులు మాత్రం ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. పవన్, మహేష్ కలయికపై కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గా మహేష్ కు పవన్ విషెస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
అప్పటి నుంచే
.. జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం అప్పట్లో అందరిని ఎట్రాక్ట్ చేసింది. అంతకు ముందే పవన్ పైరసీకి అడ్డుకట్ట వేసే విషయంలో మహేష్ బాబుతో కలిసి అడుగులు వేశారు. అర్జున్ సినిమా సమయంలో మహేష్ బాబు పిలుపుకు స్పందించిన మొదటి టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్. అప్పటి నుంచే ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగింది
సందర్బం వస్తే పవన్ కళ్యాణ్ ఎలాంటి హీరోకైనా కూడా తన సైడ్ నుంచి విషెస్ అందేలా చూసుకుంటారు. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ నటుడి విషయంలో ఆయన విషెస్ అందిస్తే సోషల్ మీడియాలో ఆ విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో మహేష్ బాబు పవన్ కు బర్త్ డే విషెస్ అంధించగా అది సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పవన్ కూడా దానికి బదులుగా మరో ట్వీట్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేసిన విషయం తెలిసిందే.
మహర్షి సినిమాకు అవార్డు రావడంతో
మహర్షి సినిమాకు అవార్డు రావడంతో
ఇక ఇటీవల మహర్షి సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో పవన్ కళ్యాణ్ స్పెషల్ గా ప్రేస్ నోట్ ద్వారా విషెస్ అందించారు. మహర్షి అత్యదిక ప్రజాదరణ పొందిన సినిమాగా జాతీయ అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ మహర్షి సినిమాకు పని చేసిన వారికి అలాగే మహేష్ బాబుకు కూడా చాలా సంతోషంగా ఉందంటూ తన బెస్ట్ విషెస్ అంధించారు. అలాగే బెస్ట్ తెలుగు మూవీగా జెర్సీకి అవార్డు రావడంతో నానికి చిత్ర దర్శక నిర్మాతలకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు.
మహేష్ బాబుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్.. చాలా సంతోషంగా ఉందంటూ
Reviewed by Manam Telugu Vaaram
on
12:11 PM
Rating:
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know