అన్ని తెలుగు వార్తల సమాహారం

‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మరో హీరో ఈయనే!

 



నాని కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మరో యువ కథానాయకుడు కనిపించబోతున్నాడు. ఆయనెవరో కాదు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌. ఇందులో ఆయన సహాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తానే ట్విటర్ వేదికగా తెలియజేశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ నాయికలుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది ఈ చిత్రం. ఇటీవలే విడుదలైన నాని ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు కనిపించని లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు నాని. మరి రాహుల్‌ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  

‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మరో హీరో ఈయనే! ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మరో హీరో ఈయనే! Reviewed by Manam Telugu Vaaram on 12:02 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.