మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోజువారీ పాజిటివ్ కేసులు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు కరోనా అంటే భయపడే స్థాయికి చేరుకున్నారు. కరోనా నుంచి బయటపడటం కోసం అక్కడి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే లాక్ డౌన్ విధించారు. మరికొన్ని చోట్ల కొన్ని రకాల ఆంక్షలు విధించారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో ఈరోజు నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు ఇక్కడే వెలుగు చూస్తున్నాయి. దీంతో పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు మహారాష్ట్ర సర్కారు మరో లాక్‌డౌన్ కు సిద్ధమవుతోందని అంటున్నారు. లాక్‌డౌన్ అమలు చేసేందుకు సిద్ధం కావాలని ఆ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారులకు సూచించారని, అందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారని అంటున్నారు. రాష్ట్రంలో వైరస్ విజృంభణపై ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఈ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.
లాక్ డౌన్ కు సిద్ధం కండి.. సీఎం కీలక ఆదేశాలు ?
Reviewed by Manam Telugu Vaaram
on
2:36 PM
Rating:
Reviewed by Manam Telugu Vaaram
on
2:36 PM
Rating:

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know