అన్ని తెలుగు వార్తల సమాహారం

పిత్తులతో నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్న మహిళ... ఎలా?

 

ఇదెలా సాధ్యం... ఇలా కూడా మనీ సంపాదిస్తారా అనే డౌట్ మీకు రావచ్చు. అవును ఇలాంటి వాళ్లూ ఉన్నారు. లక్షలు సంపాదిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.


పిత్తు లేదా అపాన వాయువు అనేది... కడుపులో గ్యాస్ లాంటిది. క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోకపోతే... ఖాళీగా ఉన్న పేగుల్లోకి గాలి చేరుతుంది. అది అటు తిరిగీ... ఇటు తిరిగీ... చివరకు కింది నుంచి బయటకు వస్తుంది. నిజానికి అపాన వాయువును కడుపులో ఉంచుకోకూడదు. అది వచ్చినప్పుడు వదిలేయాలి. లేదంటే... అది మరింత ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యానికి హాని కూడా. కాకపోతే మన సొసైటీలో అలా చేస్తే ఎవరేమనుకుంటారో అనే మొహమాటం ఒకటి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టాల్సిందే. పూర్వం ఓ పెద్ద మనిషి... అపాన వాయువును వంద రకాలుగా వదిలేవాడు. అలా రకరకాలుగా సౌండ్లు చేస్తూ... ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఆ ప్రదర్శనలకు చాలా మంది ప్రజలు వచ్చేవారు. ఆశ్చర్యపోయేవారు. అలా ఆయన అప్పట్లోనే చాలా సంపాదించాడు. అదో విదేశీ వార్త. దాన్ని అలా ఉంచితే... ఇప్పటి మన స్టోరీలో... ఓ మహిళ అదే వాయువును రకరకాల సౌండ్లు చేస్తూ వదులుతూ... నెల నెలా లక్షలు సంపాదిస్తోంది.

ఇది మనకు నమ్మశక్యం కాదు కానీ ఆమెకు ఇదే జాబ్. అపాన వాయువును రకరకాలుగా వదలడంలో ఆమె ఎక్స్‌పర్ట్. పేరు ఎమ్మా మార్టిన్. వయసు 48 ఏళ్లు. ఉండేది అమెరికాలోని కాలిఫోర్నియాలో. 1999 నుంచి రకరకాలుగా గాలి వదులుతూ... ఆ ధ్వనులను (సౌండ్లను) వీడియో రికార్డ్ చేస్తుంది. ఆ వీడియోలు ఎవరైనా చూడాలనుకుంటే... చూపిస్తూ... డబ్బు తీసుకుంటుంది.

ప్రస్తుతం ఆమె ఒక వీడియోకి రూ.366 తీసుకుంటోంది. అసలు ఇలాంటి వీడియోలు ఎవరు చూస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. ఎవరో ఒకరు ఉండారు. ఇదెలా సాధ్యం అనే డౌట్ ఉన్న వాళ్లు చూస్తారు. నమ్మలేని వాళ్లు... నిజమో కాదో తెలుసుకుందామని చూస్తారు. తాము కూడా ఇలా సంపాదించాలి అనుకునేవాళ్లు చూస్తారు. ఇలా... రకరకాల వాళ్లు... ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లుగా ఉన్నారు ఆమెకు. షాకింగ్ విషయమేంటంటే... చాలా మంది ఆ వీడియోలు బాగున్నాయని అంటుంటారు. అందుకే ఆమె ఇప్పుడు నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా సంపాదిస్తోంది. ఈ వీడియోలను ఆమె ఓన్లీ ప్యాన్స్ (OnlyFans website)లో అమ్ముకుంటోంది.

ఈ వాయువులు వదిలేందుకు ఎమ్మా ప్రత్యేక ఆహారం తీసుకుంటుంది. సలాడ్లు ఎక్కువగా తింటుంది. ఆవకాడో, మెక్సికో ఆహారం తీసుకుంటుంది. ఆ ఆహారం వల్ల ఆమె పొట్టలో గ్యాస్ తయారవుతుంది. దాన్ని వదిలేస్తూ వీడియోలు తీసుకుంటుంది.

ఎమ్మాకు ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్తకు ఆమె చేస్తున్న ఈ ఉద్యోగం గురించి తెలుసు. ఐతే... ఆమె ఈ వీడియోలు రికార్డ్ చేసేటప్పుడు ఇంట్లో... ఎవరూ లేని గదిలోకి వెళ్లి ఒంటరిగా చేస్తుంది. గతేడాది కరోనా లాక్‌డౌన్ సమయంలో... ఆమె లైవ్ వీడియోలు కూడా చేసింది. మొత్తానికి ఈ విధంగా ఆమె ఫేమస్ అవుతోంది.


పిత్తులతో నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్న మహిళ... ఎలా? పిత్తులతో నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్న మహిళ... ఎలా? Reviewed by Manam Telugu Vaaram on 2:29 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.