- ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు..
- ఫోన్లో అందుబాటులో సిబ్బంది
హైదరాబాద్ : మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తున్నారా..? లాటరీ గెలుచుకున్నారని, లక్కీడ్రిప్లో ఖరీదైన గిఫ్ట్ వచ్చిందని చెప్తున్నారా..? ఓఎల్ఎక్స్లో మీరు అమ్మకానికి పెట్టిన వస్తువును ప్రత్యక్షంగా చూడకుండానే కొనుగోలు చేస్తానని ఫోన్ చేస్తున్నారా..? క్యూర్ ఆర్ కోడ్ స్కాన్ చేయండి ముందుగా డబ్బులు పంపిస్తాను అంటూ.. నమ్మిస్తున్నారా...? మిమ్మల్ని చూడకుండానే, స్కిల్స్ తెలియకుండానే ఫలానా జాబ్‌లో సెలక్ట్ ఆయ్యారు అంటూ రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఖర్చులు చెల్లించాలని కోరుతున్నారా..? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎక్కడో ఏదో తేడా జరుగుతోందని అనుమానిస్తున్నారా..? మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీ అనుమానం మాతో పంచుకోండి అంటున్నారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడి మోసపోకుండా ఉండటానికి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.
హెల్ప్‌లైన్ ఏర్పాటు..
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ల గురిం చి ఆరా తీయడానికి, నిజానిజాలు తెలసుకోవడానికి సైబర్ క్రైమ్ విభాగంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి ఒక ల్యాండ్‌లైన్, మరొక మొబైల్‌తో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్‌పై అవగాహన ఉన్న సిబ్బందిని ఉదయం 9:00 నుంచి రాత్రి 8:00 వరకు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజల నుంచి వచ్చే ఫోన్లను రిసీవ్ చేసుకొని వారి అనుమానాలను నివృత్తి చేస్తారు. తద్వారా ప్రజలు సైబర్ నేరాల బారినపడకుండా, నేరగాళ్ల చేతికి చిక్కి రూ. లక్షల్లో నష్టపోకుండా ముందుగానే నివారించొచ్చు. ఈ మేరకు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లను సైబర్ క్రైమ్ విభాగం వారు సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫోన్లోనే కాకుండా.. నెటి జన్లు ఆన్లైన్లో కూడా సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు..
మొబైల్ నంబర్- 9490617310
ల్యాండ్‌లైన్ - 04027854031
sho-cybercrimes@tspolice.gov.in
NCR Portal:https://cybercrime.gov.in
కామెంట్లు లేవు:
if you have any doubts please let me know