అన్ని తెలుగు వార్తల సమాహారం

త్రెడ్ ఇట్.. ఇది గూగుల్ వారి టిక్ టాక్.. అఫిషియల్ మీటింగ్స్ కోసం వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం.

 

గూగులో సరికొత్త ప్లాట్ ఫాం ను తీసుకొస్తోంది. త్రెడ్ ఇట్ అనే పేరుతో ఓ కొత్త వీడియో ప్లాట్ ఫాం ను యూజర్ల ముందుకు తీసుకురాబోతోంది. వీడియో మెసేజ్ షేరింగ్‌ల హ‌వా న‌డుస్తున్న ఈ కాలంలో గూగుల్..



తాజాగా షార్ట్ వీడియో ప్లాట్ ఫాం టిక్ టాక్ మన దేశంలో బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో ఫార్మాట్ ప్రపంచమంతా మంచి స్పందన రావడంతో అన్ని సంస్థలు ఇలాంటి వీడియోలను పంచుకునేలా సరికొత్త మార్పులు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇన్ స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ మన ముందుకొచ్చాయి. తాజాగా ఇలాంటి పనిలోనే గూగుల్ కూడా ఉందని వార్తలొస్తున్నాయి. వీడియో మెసేజ్ షేరింగ్‌ల హ‌వా న‌డుస్తున్న ఈ కాలంలో గూగుల్ `త్రెడ్ఇట్`తో సంచ‌ల‌నం సృష్టించ‌బోతోంది. గూగుల్ తీసుకొస్తున్న `త్రెడ్ఇట్` యూజ‌ర్ల‌కు మ‌రింత సౌక‌ర్యాన్ని అందిస్తుందని ఆ కంపెనీ వెల్లడిస్తోంది. ఇది స‌రికొత్త వీడియో స‌ర్వీస్. ఈ గూగుల్ `త్రెడ్ఇట్` స‌ర్వీస్‌లో యూజ‌ర్లు రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్‌ని లేక‌పోతే మీ స్క్రీన్ ను టీమ్ స‌భ్యుల‌తో షేర్ చేసుకోవ‌చ్చు.

`త్రెడ్ఇట్` దానిక‌ది స‌ప‌రేట్ వెబ్‌సైట్‌గానూ, అలాగే క్రోమ్‌కి ఎక్స్‌టెన్ష‌న్‌గానూ ఉండ‌బోతోంది. ఈ స‌ర్వీస్‌ని గూగుల్ ఇన్‌-హౌస్ ఇంక్యుబేట‌ర్‌, ఏరియా 120 ద్వారా అభివృద్ధి చేశారు.`త్రెడ్ఇట్`తో యూజ‌ర్లు మ‌ల్టిపుల్ వీడియో క్లిప్‌ల‌ను రికార్డ్ చేయొచ్చు. త‌ర్వాత వీట‌న్నింటినీ క‌లిపి ఒకే వీడియో మెసేజ్‌లాగా త‌యారుచేయొచ్చు కూడా. ఇమెయిల్‌, చాటింగ్‌లో పంపించే మెసేజ్‌ల్లా కాకుండా `త్రెడ్ఇట్`లో వీడియో మెసేజ్ ల ద్వారా మ‌రింత స‌మాచారాన్ని చెప్ప‌డానికి, చూపించ‌డానికి అనువుగా ఉంటుంది. అయితే ఇది సోష‌ల్ మీడియా లాగా బ‌హిరంగ‌ంగా ఉండదు

దీన్ని కేవలం కొంతమంది సెలెక్టీవ్ టీమ్ మెంబ‌ర్ల‌తోనే షేర్ చేసే వీలుంటుంది. పెద్ద పెద్ద మీటింగ్‌లు అవ‌స‌రం లేకుండా `త్రెడ్ఇట్`ని వినియోగించుకొని సులువుగా మెసేజ్ పాస్ చేయొచ్చ‌ని అంటున్నారు గూగుల్ ఏరియా 120 ప్రాజెక్ట్ కి, `త్రెడ్ఇట్`కి రూప‌క‌ర్త‌, ఫౌండ‌ర్‌, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అయిన కెల్ల‌ర్ స్మిత్. ఇక మీ వీడియోల‌పై ఎవ‌రైనా స్పందించాలంటే వారి వీడియోలను మీరు యాడ్ చేయ‌డానికి ప‌ర్మిష‌న్ ఇవ్వొచ్చు. లేదంటే కేవ‌లం మీ వీడియోల‌ను చూడ‌టానికి మాత్ర‌‌మే ప‌ర్మిష‌న్ ఉంచొచ్చు.

`త్రెడ్ఇట్`లో ఈజీగా వీడియో క్లిప్స్ ని ఎక్స్‌చేంజ్ చేసుకోవ‌చ్చు. అలాగే `త్రెడ్ఇట్`లో ఉన్న మ‌రో వెసులుబాటు ఏంటంటే, వీడియో క్లిప్ లింక్ షేర్ చేయ‌డం ద్వారా కూడా ఎవ‌రికైనా వీడియోను పంపొచ్చు. దీనితో వీడియో క్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు. `త్రెడ్ఇట్` టూల్‌లో స్టాండ‌ప్, పిచ్‌, కోడ్ రివ్యూ, ఫీడ్‌బ్యాక్ ఆన్ డిజైన్ ట్యుటోరియ‌ల్‌, ఫెయిర్‌వెల్ వంటివి 18 ప్రీ-లోడెడ్ ట్యాంప్‌లెట్లు ఉంటాయి. ఇందులో ప్ర‌తీదీ ఒక్కో స్టెప్‌లో ఉంటుంది. క‌నుక మ‌న‌కు కావ‌ల‌సిన విధంగా వీడియోల‌ను రికార్డు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. మొత్తానికి గూగుల్ తీసుకొస్తున్న `త్రెడ్ఇట్` ఇంట‌ర్నెట్ వీడియో షేరింగ్ నెట్‌వ‌ర్క్‌ ను ఇంకో లెవ‌ల్‌కి తీసుకెళ్తుంద‌ని చెప్పుకోవచ్చు.


త్రెడ్ ఇట్.. ఇది గూగుల్ వారి టిక్ టాక్.. అఫిషియల్ మీటింగ్స్ కోసం వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం. త్రెడ్ ఇట్.. ఇది గూగుల్ వారి టిక్ టాక్.. అఫిషియల్ మీటింగ్స్ కోసం వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం. Reviewed by Manam Telugu Vaaram on 1:23 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.