అన్ని తెలుగు వార్తల సమాహారం

67th National Film Awards: నేషనల్ అవార్డుల్లో చిరంజీవి సినిమాకు అన్యాయం జరిగిందా..?

 

67th National Film Awards: 67వ జాతీయ అవార్డుల ప్రకటన పూర్తైపోయింది. ఉత్తమ నటుడిగా ధనుష్, మనోజ్ బాజ్‌పెయీ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా కంగన రనౌత్ మరోసారి ఎంపికైంది. తెలుగులో కూడా మహర్షి, జెర్సీ లాంటి సినిమాలకు అవార్డులు వచ్చాయి.




67వ జాతీయ అవార్డుల ప్రకటన పూర్తైపోయింది. ఉత్తమ నటుడిగా ధనుష్, మనోజ్ బాజ్‌పెయీ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా కంగన రనౌత్ మరోసారి ఎంపికైంది. తెలుగులో కూడా మహర్షి, జెర్సీ లాంటి సినిమాలకు అవార్డులు వచ్చాయి. ఈ సారి 5 నేషనల్ అవార్డులు వచ్చాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్ని సినిమాలకు అవార్డులు రాకుండా అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగులో ఇంకొన్ని సినిమాలకు కూడా అవార్డులు రావాల్సి ఉందని.. 2019లో కొన్ని మంచి సినిమాలు వచ్చాయని.. వాటికి కచ్చితంగా అవార్డులు వస్తాయని అంతా అనుకున్నారని చర్చ జరుగుతుంది. మరోవైపు ఉత్తమ చిత్రంగా ఇంకా విడుదల కాని మోహన్ లాల్ మరక్కర్ అరబ్ సినిమాకు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ సినిమాకు మరో మూడు విభాగాల్లో కూడా అవార్డులు దక్కాయి. బెస్ట్ కాస్ట్యూమ్స్ - బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలలో ఎంపిక చేశారు. మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ సినిమా మే 13, 2021న విడుదల కానుంది. 2019లోనే సెన్సార్ అయింది కాబట్టి ఈ సినిమాకు అవార్డులు ఇచ్చారు. అయితే ఇక్కడే అసలు చర్చకు తెర లేస్తుంది.


కేరళలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోహన్ లాల్ సినిమాకు అవార్డులు ఇచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది. మరోవైపు ఉత్తమ నటి కేటగిరీలో కూడా కంగన రనౌత్‌కు వచ్చిన అవార్డు కూడా అలాంటిదే అంటూ వార్తలొస్తున్నాయి. ఈమెకు కూడా మోడీ హయాంలోనే మూడు నేషనల్ అవార్డులు వచ్చాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నేషనల్ అవార్డుల విషయంలో సైరా సినిమాకు అన్యాయం జరిగిందని మెగా ఫ్యాన్స్ గోల చేస్తున్నారు. 2019లో విడుదలైన సైరా నరసింహారెడ్డి ఇతర భాషల్లో ఫ్లాప్ అయినా తెలుగులో పర్లేదనిపించింది.

140 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమాలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌కు తోడు యాక్షన్ సీక్వెన్సులు కూడా ఉన్నాయని.. కానీ నేషనల్ అవార్డుల జ్యూరీ సభ్యులకు అవేం కనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు మెగాభిమానులు. ఇంకా విడుదల కాని.. ప్రేక్షకులు చూడని మరక్కర్ సినిమాలో కనిపించిన అద్భుతాలు.. విడుదలైన సైరాలో కనిపించలేదా అని అడుగుతున్నారు. కేవలం సైరా మాత్రమే కాదు.. మరికొన్ని సినిమాలకు కూడా జాతీయ అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని చర్చ జరుగుతుంది.

67th National Film Awards: నేషనల్ అవార్డుల్లో చిరంజీవి సినిమాకు అన్యాయం జరిగిందా..? 67th National Film Awards: నేషనల్ అవార్డుల్లో చిరంజీవి సినిమాకు అన్యాయం జరిగిందా..? Reviewed by Manam Telugu Vaaram on 1:18 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.