అన్ని తెలుగు వార్తల సమాహారం

AP: గుంటూరులో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఈ ఏడు జిల్లాల వాళ్లు పాల్గొనవచ్చు.. 8, 10, ఇంటర్‌ పాసైతే చాలు

 

AP Guntur Army Recruitment Rally: గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది.


ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఆర్మీలో చేరాలనుకుంటున్న అభ్యర్థులకు ఇండియన్‌ ఆర్మీ సువర్ణావకాశం కల్పించబోతుంది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది.

గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం గుంటూరులోని కాసు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీ మే 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.

పోస్టులు:
సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్/నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్ మన్ పోస్టుల భర్తీకి ఈ ర్యాలీని చేపట్టనున్నారు.

అర్హతలు:
  • పోస్టుల ఆధారంగా ఎనిమిది, పదో తరగతి, సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • వయసు: సోల్జర్ జనరల్ డ్యూటీ అభ్యర్థుల వయస్సు 17 1/2 నుంచి 21 ఏళ్లు ఉండాలి. మిగతా పోస్టులకు 23 ఏళ్ల వయస్సు ఉండాలి.
  • ఎంపిక: ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్ (పీఎఫ్టీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ), మెడికల్ టెస్ట్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
  • ర్యాలీ నిర్వహణ తేదీ: మే 16, 2021 నుంచి మే 30, 2021 వరకు ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 17, 2021
  • దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్‌ 30, 2021
  • వెబ్ సైట్‌:http://www.joinindianarmy.nic.in/


AP: గుంటూరులో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఈ ఏడు జిల్లాల వాళ్లు పాల్గొనవచ్చు.. 8, 10, ఇంటర్‌ పాసైతే చాలు AP: గుంటూరులో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. ఈ ఏడు జిల్లాల వాళ్లు పాల్గొనవచ్చు.. 8, 10, ఇంటర్‌ పాసైతే చాలు Reviewed by Manam Telugu Vaaram on 11:24 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.