అన్ని తెలుగు వార్తల సమాహారం

సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై


తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశంలోని యావత్‌ సినీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకర్షించాయి. ఇక సీతగా అలియాభట్‌ వేషధారణ చాలామందిని కట్టిపడేసింది. దీంతో చాలామంది అమ్మాయిలు సీతలా రెడీ అయి ఫొటోషూట్‌ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో హిందీ టెలివిజన్‌ నటి అమ్ము రామచంద్రన్‌ ఆర్‌ఆర్‌ఆర్‌లోని సీత పాత్రను రీక్రియేట్‌ చేస్తూ కొన్ని ఫొటోలు దిగింది. వాటిని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ దీనికి చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేసింది. 

ఈ ఫొటోలను చూసిన చిత్రయూనిట్‌ 'వావ్..'‌ అంటూ లవ్‌ సింబల్‌తో పాటు నమ్కరిస్తున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటజన్లకు దిమ్మతిరిగిపోయింది. చాలా రోజుల నుంచి కామెంట్లు చేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు కానీ, ఓ అమ్మాయి సీత గెటప్‌లో ఫొటో దిగగానే రిప్లై ఇచ్చారా? అంటూ కామెంట్లు చేశారు. 'అర్జెంట్‌గా సీత కాస్ట్యూమ్స్‌ కొనుక్కుని ఫొటోషూట్‌ చేసి పంపుతా.. అప్పుడు కానీ రిప్లై ఇచ్చేలా లేవు మావా..' అంటూ ఓ వ్యక్తి ఆర్‌ఆర్‌ఆర్‌ను బెదిరించాడు. దీంతో హడలెత్తిపోయిన చిత్రయూనిట్‌ అలాంటి పనులు చేసి భయపెట్టకు జనాలను అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది.


కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శకేంద్రుడు రాజమౌళి డైరెక్షన్‌ చేస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల కానుంది.


 

సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై సీతగా మారిపోతానన్న వ్యక్తికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫన్నీ రిప్లై Reviewed by Manam Telugu Vaaram on 9:42 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.