YS Sharmila Reddy: నేను జగనన్న వదిలిన బాణాన్ని కాదు.. కేసీఆర్‌తో కూడా సంబంధం లేదు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్..
ఏప్రిల్ నెల 9వ తేదీన ఖమ్మంలో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభ జరగనుంది. ఈమేరకు ఈ సభకు పోలీసుల నుంచి అనుమతి కూడా లభించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవలేదు. జెండా, అజెండా ఇంకా ఖరారు కానేలేదు. అయినా ఇంకా పెట్టని పార్టీలోకి ఇప్పటికే వలసలు మొదలయ్యాయి. పైగా ఏదో అధికారంలేని పార్టీ నుంచి అనుకుంటే అది వేరు. పదవి లేని వాళ్లా అనుకుంటే అది కూడా వేరేలెక్క. కానీ ఇక్కడ వైఎస్ షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకున్నది ఓ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్. ప్రస్తుతం ఆమె ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్. ఆమె పేరు శీలం విద్యాలత. ఉన్నది తెరాస పార్టీలో. రాష్ట్రంలో తెరాసకు ఇంకా మూడేళ్ల పాటు అధికారం ఉంది. విద్యాలతకు ఇంకా నాలుగేళ్లకు పైగా పదవికాలం ఉంది. అయినా ఆమె పార్టీ మారారు. వైఎస్ రాజశేఖరరరెడ్డి కుమార్తెగా ఆమె స్థాపించబోయే పార్టీలో మొదటి నుంచి పనిచేయాలని, ఆమె వెన్నంటి నడవాలన్నది విద్యాలత ఆలోచన.
ఆమె భర్త శీలం వెంకటరెడ్డి భరత్ విద్యాసంస్థల డైరెక్టర్. ఈమేరకు మీరిరువురూ వైఎస్ షర్మిలను మంగళవారం నాడు లోటస్‌పాండ్‌లో కలిశారు. ఈ సందర్భంగా తాము తెరాసకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజకీయంగా వైఎస్ షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయుల్లో బలంగా పాదుకుపోయిన తెరాసకు రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇది చిన్న పరిణామమే. ఎక్కడో ఒక మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పార్టీ నుంచి వెళ్లిపోతే అది పెద్ద విషయం కూడా కాకపోవచ్చు.
ఆమె భర్త శీలం వెంకటరెడ్డి భరత్ విద్యాసంస్థల డైరెక్టర్. ఈమేరకు మీరిరువురూ వైఎస్ షర్మిలను మంగళవారం నాడు లోటస్‌పాండ్‌లో కలిశారు. ఈ సందర్భంగా తాము తెరాసకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజకీయంగా వైఎస్ షర్మిల వెంట నడవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయుల్లో బలంగా పాదుకుపోయిన తెరాసకు రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇది చిన్న పరిణామమే. ఎక్కడో ఒక మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పార్టీ నుంచి వెళ్లిపోతే అది పెద్ద విషయం కూడా కాకపోవచ్చు.
YS Sharmila Reddy: నేను జగనన్న వదిలిన బాణాన్ని కాదు.. కేసీఆర్‌తో కూడా సంబంధం లేదు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్..
Reviewed by Manam Telugu Vaaram
on
2:44 PM
Rating:
Reviewed by Manam Telugu Vaaram
on
2:44 PM
Rating:

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know