అన్ని తెలుగు వార్తల సమాహారం

Pawan Kalyan‌పై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. మోదీ పేరు చెప్పి మరీ, ఏంటీ మార్పు!

 

రాష్ట్రానికి అధిపతి అయ్యేది పవన్ కళ్యాణ్ అని.. ఈ విషయాన్ని ట్రూ స్పిరిట్‌లో తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. 2014 ఎన్నికల సమయంలో అంశాలను ప్రస్తావించారు.




పవన్ కళ్యాణ్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే మోదీకి ఎంతో అభిమానమని.. ఆయన్ను గౌరవంగా చూసుకోవాలని మోదీ చెప్పారన్నారు. రాష్ట్రానికి అధిపతి అయ్యేది పవన్ అని.. ఈ విషయాన్ని ట్రూ స్పిరిట్‌లో తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. 2014 ఎన్నికల సమయంలో అంశాలను ప్రస్తావించారు. సోము వీర్రాజు ఉన్నట్టుండిపై పవన్‌పై ప్రశంసలు కురిపించడంతో ప్రధాని మోదీనే స్వయంగా తనతో చెప్పారనడం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ తీరుపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణికి అనూహ్యంగా మద్దతు తెలిపారు. తెలంగాణ బీజేపీ నేతలు తీరు సరిగా లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఏపీ బీజేపీ జాగ్రత్తపడినట్ల కనిపిస్తోంది. ఇరు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు భావిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో నష్టపోకుండా పావులు కదుపుతున్నారు. అందుకే తిరుపతి బీజేపీ-జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే రత్నప్రభ వెళ్లి హైదరాబాద్‌లో పవన్‌ను కలిశారు.. మద్దతు కోరారు. ప్రచారానికి కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సోము వీర్రాజు కూడా ప్రశంసలు కురిపించారు.

Pawan Kalyan‌పై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. మోదీ పేరు చెప్పి మరీ, ఏంటీ మార్పు! Pawan Kalyan‌పై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. మోదీ పేరు చెప్పి మరీ, ఏంటీ మార్పు! Reviewed by Manam Telugu Vaaram on 1:56 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.