అన్ని తెలుగు వార్తల సమాహారం

Credit Card, డెబిట్ కార్డు వాడే అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!

 

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. మంత్లీ రికరింగ్ పేమెంట్లపై ప్రభావం పడనుంది. ఆర్‌బీఐ కొత్త రూల్స్ వల్ల ఆటో డెబిట్ ఫెసిలిటీకి అంతరాయం ఏర్పడొచ్చు.



మీరు క్రెడిట్ కార్డు బాగా ఉపయోగిస్తున్నారా? లేదంటే డెబిట్ కార్డు వంటివి వాడుతున్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా జరిపే రికరింగ్ పేమెంట్స్‌‌కు అంతరాయం కలగొచ్చు.

బ్యాంకుల ఆటో డెబిట్ ఫెసిలిటీ ద్వారా మొబైల్ ఫోన్ బిల్స్, యుటిలిటీ బిల్లులు, మీడియా కంటెంట్ సబ్‌స్క్రిప్షన్, ఓవర్ ద టాప్ స్ట్రీమింగ్ సర్వీసులకు చెల్లించే పేమెంట్లకు అంతరాయం ఏర్పడొచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా పవర్, బీఎస్ఈఎస్ వంటి కంపెనీలపై కూడా ప్రభావం పడొచ్చు.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI.. బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్స్, ఆన్‌లైన్ వెండర్లు వంటి వాటికి మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. కస్టమర్లు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే రికరింగ్ పేమెంట్లకు సంబంధించిన రెండంచెల అథంటికేషన్ రూల్స్‌ను ఇవ్వన్నీ అనుసరించాల్సి ఉంది.

కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంకులు, క్రెడిట్ కార్డు సర్వీస్ ప్రొవైడర్లు కస్టమర్లకు ఐదు రోజులు ముందుగానే డబ్బులు కట్ అవుతాయనే మెసేజ్‌ను పంపాలి. దీనికి కస్టమర్ నుంచి ఓకే అనే సమధానం రావాలి. అప్పుడు ఆటో డెబిట్ సదుపాయం పని చేస్తుంది. ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి.

అయితే బ్యాంకులు, ఇతర వెండర్లు ఆర్‌బీఐ రూల్స్‌ను అమలు చేసే స్థితిలో లేనట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ గడువు కోరుతున్నాయి. అయితే ఆర్‌బీఐ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. అందువల్ల డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ఆటోమేటిక్ మంత్లీ పేమెంట్స్‌కు అంతరాయం కలగొచ్చు.


Credit Card, డెబిట్ కార్డు వాడే అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్! Credit Card, డెబిట్ కార్డు వాడే అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్! Reviewed by Manam Telugu Vaaram on 11:11 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.