అన్ని తెలుగు వార్తల సమాహారం

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు.. లోక్‌సభలో తేల్చి చెప్పిన కేంద్రం


 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పింది. ఏపీకి ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేశారో కేంద్రం స్పష్టం చేయాలని తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ అంశంపై అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్‌.. పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాల్సి ఉందని సమాధానమిచ్చారు.

అలాగే ప్రత్యేక హోదాపై ఎంపీ రామ్మోహన్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. ఏపీకి ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని పాత పాటే పాడారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కుదరదని పునరుద్ఘాటించారు. పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు అమల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ప్రాజెక్టులు, విద్యా సంస్థల నిర్మాణం సుదీర్ఘ కాలం పట్టే అంశాలని పేర్కొన్నారు. విభజన హామీల అమలుకు వివిధ శాఖలతో సమీక్ష చేస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు జరిగాయన్నారు.

ఇక, ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు పూర్తయినా పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు ఇంకా నెరవేరలేదన్నారు. దీనికి కారణాలేంటో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు



ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు.. లోక్‌సభలో తేల్చి చెప్పిన కేంద్రం ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు.. లోక్‌సభలో తేల్చి చెప్పిన కేంద్రం Reviewed by Manam Telugu Vaaram on 3:32 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.