అన్ని తెలుగు వార్తల సమాహారం

తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు.. బయటకు వెళ్లారో అంతే సంగతులు

 

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి వడగాలులు విపరీతంగా పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందువల్ల పగటిపూట ప్రజలు బయటకు వెళ్లకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు.




కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు నేటి నుంచి మరో ముప్పు పొంచుకొస్తోంది. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వడగాలల తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభమైన వడగాలులు ఆదివారం నుంచి తీవ్రరూపం దాల్చనున్నాయని స్పష్టం చేశారు. వీటి ప్రభావంలో సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.

ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలతో పాటు, తెలంగాణలోని మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే వడగాలులకు కారణమని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.

దీంతో పగటి పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాడని, కచ్చితంగా వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలని, లేకపోడే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండం, మజ్జిగ తాగడం మంచిదని, మసాలా పదార్థారాలకు వీలైనంత దైరంగా ఉండాలని చెబుతున్నారు.


తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు.. బయటకు వెళ్లారో అంతే సంగతులు తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు.. బయటకు వెళ్లారో అంతే సంగతులు Reviewed by Manam Telugu Vaaram on 12:29 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.