కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీల కేసులో బాధిత యువతి సోమవారం కోర్టు ముందు లొంగిపోవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. సీడీ విడుదలైన మార్చి 2వ తేదీ నుంచి ఆమె పరారీలో ఉంది. తన వాదనలను వినిపిస్తూ ఇప్పటివరకు 5 వీడియోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. పోలీసులు కూడా ఆమెను ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఆదివారం ఉదయం సదరు యువతి న్యాయవాది జగదీశ్, తన సహోద్యోగి మంజునాథ్‌తో సోషల్ మీడియాలో జరిపిన సంప్రదింపులు ఇందుకు ఊతమిస్తున్నాయి.
యువతి సోమవారం ఏదైనా కోర్టులో లొంగిపోవచ్చని జగదీశ్ తెలిపారు. ఆమె కోర్టుకు వచ్చిన తక్షణం అదుపులోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. యువతి తల్లిదండ్రులకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు హోంమంత్రి బసవరాజ బొమ్మై, సీఎం యడియూరప్ప ఆదివారం ఉదయం సమావేశమై కేసు గురించి చర్చించారు. ఇక జార్కిహొళి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ల మద్దతుదారులు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
Reviewed by Manam Telugu Vaaram
on
6:10 PM
Rating:

కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know