అన్ని తెలుగు వార్తల సమాహారం

ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ పేరుతో భారీ మోసం


 హైదరాబాద్/నార్సింగ్‌ : ఆన్‌లైన్‌ రిక్రూట్‌ మెంట్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఇద్దరి నుంచి రూ.6.70 లక్షలు కొల్లగొట్టారు. గండిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రిక్రూట్‌మెంట్‌ అవకాశమంటూ ఉన్న ప్రకటనను చూశాడు. రోజుకు రూ.2 వేల వరకు సంపాదించవచ్చని సూచించడంతో నమ్మి వారిని సంప్రదించాడు. సైబర్‌ నేరగాళ్లు పంపిన లింక్‌కు బ్యాంకు ఖాతా వివరాలు జోడించడంతోపాటు రీచార్జ్‌ల పేరుతో డెబిట్‌ కార్డు ద్వారా రూ.18 వేల వరకు చెల్లించాడు. అతడి సోదరుడిని కూడా ఇందులో చేర్పించాడు. అతడికి వచ్చిన లింక్‌ల్లో బ్యాంకు ఖాతావివరాలు ఇచ్చాడు. అనంతరం ఇరువురి ఖాతాల నుంచి రూ.6.70 లక్షలు మాయం కావడంతోపాటు వీరిద్దరినీ సంబంధిత గ్రూపుల నుంచి తొలగించారు. దాంతో మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ పేరుతో భారీ మోసం ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ పేరుతో భారీ మోసం Reviewed by Manam Telugu Vaaram on 11:44 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.