రవితేజ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని సమాచారం. రెగ్యులర్ షూటింగ్‌ను మాత్రం మే రెండో వారంలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నారట.
స్క్రిప్ట్ పరంగా ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో చాన్స్ ఉందని, ఇందులో శ్రీలీల, లవ్లీ సింగ్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘ఖిలాడి’ సినిమా కోసం ఇటలీలో ఉన్నారు రవితేజ. ఇందులోనూ రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ ఏడాది మే 28న ఈ చిత్రం విడుదల కానుంది.
రవితేజ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లట!
Reviewed by Manam Telugu Vaaram
on
12:26 PM
Rating:
![రవితేజ కొత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లట!](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgPdUNcEyLxoF9S39VwykACfD3E3QZApcAifC7AzPaU7uRHbAUyFSCNyjKtK7VnGiLZZ_K8e6Av7muMtCi-6BmZLezEfNVb8mCNbRKleEuiCVH27KykcrGh6NHy8E6olwKIg7loRDhNihHg/s72-c/ravi+teja_mugguru.jpg)
కామెంట్‌లు లేవు:
if you have any doubts please let me know