అన్ని తెలుగు వార్తల సమాహారం

మరోసారి హీరోగా చేయడానికి ఓకే చెప్పిన వడివేలు

 హాస్యనటుడు వడివేలు మరోసారి హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. తమిళంలో మరుదమలై, తలైనగరం సినిమాలను డైరెక్ట్‌ చేసిన సూరజ్‌ దర్శకత్వంలో వడివేలు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌లో స్టార్ట్‌ కానుందని కోలీవుడ్‌ సమాచారం. సూరజ్‌ డైరెక్ట్‌ చేసిన ‘మరుదమలై, తలై నగరం’ ఈ రెండు సినిమాల్లోనూ వడివేలు కీలక పాత్రల్లో నటించారు.

సో... ఇప్పుడు వడివేలు హీరోగా సూరజ్‌ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఉహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇంతకుముందు ‘ఇమ్‌సై అరసన్‌ 23ఆమ్‌ పులికేసి’, ‘తెనాలిరామన్‌ ’ వంటి సినిమాల్లో వడివేలు హీరోగా నటించారు. అయితే తాను మరోసారి హీరోగా నటించనని కమెడియన్‌ వడివేలు గతేడాది ప్రకటించారు. అయినప్పటికీ ఆయనకు సినిమా అవకాశాలు వస్తుండటంతో మరోసారి హీరోగా నటించడానికి ఓకే చెప్పారు. 



మరోసారి హీరోగా చేయడానికి ఓకే చెప్పిన వడివేలు మరోసారి హీరోగా చేయడానికి ఓకే చెప్పిన వడివేలు Reviewed by Manam Telugu Vaaram on 2:10 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

if you have any doubts please let me know

Blogger ఆధారితం.